కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక థియేటర్లు తెరిచే చాన్స్ లేకపోవడంతో యువదర్శకులంతా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల వైపు పరుగులు తీస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి యువ దర్శకుడు అనిల్ రావిపూడి చేరిపోయారు. అల్లు అరవింద్ ప్రారంభించిన డిజిటల్ యాప్ ఆహా కోసం అనిల్ రావిపూడి ఓ కామెడీ వెబ్‌సీరిస్‌ను తెరకెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్తనటీనటులతో ఈ వెబ్‌సీరిస్‌ను ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం. మరో పక్క అనీల్ ‘ఎఫ్3’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. కరోనా ప్రభావం […]
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్‌ను సామాజిక […]
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అక్టోబర్‌లో టీకా వచ్చే అవకాశం ఉన్నదని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటీవల చింపాంజీలపై చేసిన ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవ ప్రయోగాలను వేగంగా నిర్వహిస్తున్నట్టు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త జెనెన్‌ర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఆడ్రియన్ హిల్ ప్రకటించారు. ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ కొత్త టీకాను ఇప్పటికే బ్రెజిల్‌లోని కొంతమంది కార్యకర్తలపై […]
న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టెస్ట్ క్రికెట్‌పై తన అభిమతాన్ని చాటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. టెస్టులకు ఉండే విలువ ఏ ఫార్మాట్‌కు ఉండదని స్పష్టం చేశాడు. ‘మెరిసే తెల్లని దుస్తులతో ఎర్రబంతితో క్రికెట్ ఆడడం నా అదృష్టం. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం మరింత గర్వపడే అంశం. దీని దరిదాపుల్లోకి ఏదీ రాదు. టెస్ట్ క్రికెటే నిజమైన ఆట. అందుకే ఈ ఫార్మాట్‌కు మరింత ప్రాచుర్యం […]
న్యూఢిల్లీ: ఓవైపు బయోసెక్యూర్ వాతావరణం.. మరోవైపు ఐసోలేషన్ నిబంధనల మధ్య ట్రైనింగ్ చేయడం క్రికెటర్లకు అంత సులువు కాదని ఈసీబీ క్రికెట్ డైరెక్టర్ ఆష్లే గైల్స్ అన్నాడు. ‘స్టేడియంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, మాస్కులు కట్టుకోవడం, వ్యక్తిగతంగా ఎక్కువ సమయం గడపడం అనుకున్నంత ఈజీ కాదు. మన వ్యవహారాలకు ఇది పూర్తి భిన్నం ఇదేదో విరామం అనుకుంటే సీరియస్‌గా తప్పు చేసినట్లే. అన్ని ప్రొటోకాల్స్ పాటించాల్సిందే. దీనిని పక్కనబెడితే.. ప్రతి రోజు రెండు సెషన్స్‌లో క్రికెట్ ఉంటుంది. […]
న్యూఢిల్లీ: గణాంకాలు, రికార్డుల పరంగా భారత్‌లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరంటే ఠక్కున సచిన్ టెండూల్కర్ పేరు చెబుతారు. కానీ అభిమానులు మాత్రం మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌కు ఓటేశారు. 50 ఏళ్లలో భారత క్రికెట్లో అత్యుత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరని విజ్డెన్ ఇండియా ఓ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మొత్తం 16 మంది పోటీపడగా చివరకు వచ్చేసరికి సచిన్, ద్రవిడ్, గవాస్కర్, కోహ్లీ నిలబడ్డారు. వీళ్ల మధ్య ఓటింగ్ రేస్ హోరాహోరీగా సాగింది. ఆఖరిలో సచిన్‌ను […]
కరాచీ: తమ టీమ్‌లో పదిమంది క్రికెటర్లు కరోనా బారిన పడ్డారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించిన మరుసటి రోజే ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ తనకు కరోనా లేదని ప్రకటించాడు. తనతో పాటు కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ బారిన పడలేదని వెల్లడించాడు. ‘పీసీబీ చెప్పిన విషయాన్ని మరోసారి ధ్రువీకరించుకునేందుకు నేను వ్యక్తిగతంగా టెస్ట్ చేయించుకున్నా. కుటుంబసభ్యులకు కూడా. దేవుడి దయతో నాకు, నా కుటుంబానికి వైరస్ సోకలేదు. అన్ని పరీక్షల ఫలితాలు నెగెటివ్‌గా వచ్చాయి. అల్లానే […]
చెన్నై: గతంలో సమయ నియంత్రణలో ఎప్పుడూ చెస్ ఆడలేదని, అందుకే ఈసారి ఫిడే మహిళల ఆన్లైన్స్పీడ్ చెస్ టోర్నీలో బరిలోకి దిగుతున్నానని భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి చెప్పింది. దీనివల్ల ప్లేయర్ల వేగం ఎంతో తెలుస్తుందని పేర్కొంది. గ్రాండ్‌మాస్టర్లు ద్రోణవల్లి హారిక, వైశాలి, ప్రపంచ చాంపియన్ జు వెనుజు లాంటి మేటి ప్లేయర్లు ఇందులో పాల్గొననుండటంతో టోర్నీ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పింది. స్పీడ్ చెస్‌లో ఎత్తు వేయడానికి ఒక నిమిషం లభిస్తుంది. ఒక్కో ఎత్తు తర్వాత ఒక్కో […]