సారథిన్యూస్, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్‌ఫీల్డ్ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు […]
సారథిన్యూస్, మహబూబాబాద్: హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నది. ఆరోవిడుత హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో హరితహారం నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ నరేశ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్ఐలు నరసయ్య, పూర్ణచందర్, సురేశ్, లాల్ బాబు, ఐటీ కోర్ ఇన్స్‌స్పెక్టర్ రాజయ్య, సీఐ సాగర్, సీసీఎస్ సీఐ ఏ వెంకట్రావు, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది, స్పెషల్ […]
ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో సస్పెన్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘శశి’ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం ఆది తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఆది గత సినిమాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇప్పటివరకు కనిపించని సరికొత్త రూపంలో ఆది ఈ సినిమాలో కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో ఆది ‘శశి’ అనే ఓ మాస్ పాత్రలో […]
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులు, మొబైల్ అప్లికేషన్లు (యాప్స్) నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వచ్చిన తరుణంలో 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్ వంటి యాప్‌లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69 ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు 2019ను అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఈ యాప్‌లను […]
ఆన్‌లైన్‌లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్-నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకావిష్కరణ న్యూఢిల్లీ: విద్యావ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతో పాటు అందరికీ సెకండరీ, ఉన్నతవిద్యను అందించవచ్చని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో.. ఐసీటీ అకాడమీ రూపొందించిన ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్- నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ..‘ఎంతోమంది చిన్నారులకు సాంకేతిక ఉపకరణాల వినియోగం […]
ప్రస్తుతం బాలకృష్ణ ‘లెజెండ్, సింహా’వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీ దర్శకుడు బి.గోపాల్‌తో చేయాలి అనుకుంటున్నాడట. బాలయ్యకు మొదటిసారి మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు బి.గోపాల్. వారిద్దరి కాంబినేషన్లో ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా.. అన్ని ఎంట్రెన్స్ టెస్టులను అన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈ సెట్, పీజీసెట్, లాసెట్, పీజీఎల్‌సెట్, ఎడ్‌సెట్, పీఈసెట్అన్ని వాయిదాపడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.
గతేడాది మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో రవి అనే సీరియస్ పాత్ర పోషించి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అల్లరి నరేష్. కామెడీకి కేరాఫ్ అడ్రస్ అయినా కూడా సీరియస్ పాత్రల్లో కూడా అంతే యాక్షన్‌ను పండించే ఈసారి కూడా నరేష్ ఓ సీరియస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నరేష్ కెరీర్లో 57వ చిత్రంగా రూపొందుతున్న నాంది సినిమా పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. […]