Breaking News

Day: June 23, 2020

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా సంతోషి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇటీవల చైనా సైనికుల దాడిలో అసువులు బాసిన కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (గ్రూప్‌–1 కేడర్‌)గా నియమిస్తూ తెలంగాణ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమవారం రాత్రి జీవో నం.80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె నెలరోజుల్లో సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈ జీఓ ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270 […]

Read More

అప్పులే .. ఆమ్​దానీ లేదు

మన అప్పులు రూ.3లక్షల కోట్లు ఏడాదికి వడ్డీ రూ.15వేల కోట్లు పేరుకుపోతున్న బకాయిలు సర్దుబాటుకు ఆర్థికశాఖ తీవ్ర కసరత్తు ఇప్పటికే బాండ్ల విక్రయంతో రూ.14వేల కోట్ల సమీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రం అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బకాయిలు పేరుకుపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయే నాటికి (2 జూన్‌, 2014) తెలంగాణ వాటాగా రూ.60వేల కోట్ల అప్పు మన మీద పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరేండ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లపై చిలుకు అప్పులను […]

Read More

రీ రికార్డింగ్ దశలో ‘క్లూ’

నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా సంక్షోభం ఏర్పడటంతో వందలాది చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అలా కరోనా కారణంగా బ్రేక్ తీసుకున్న చాలా చిత్రాలు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని రిలీజ్​కు సిద్ధమవుతున్నాయి.థియేట్రికల్ రిలీజ్ చేయాలా? లేక ఓ టీటీ ప్లాట్ ఫామ్ ను ఆశ్రయించాలా? అన్న సందిగ్ధం అలాగే ఉన్నప్పటికీముందు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవాలి అనే లక్ష్యంతో చాలామంది నిర్మాతలు […]

Read More

ఏపీ ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్​, విజయనగరం: దేశవ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా వైరస్​ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్​కు కరోనా సోకినట్టు సమాచారం.

Read More

జూలై 3 న ‘భానుమతి రామకృష్ణ’

ఇటీవల వచ్చిన ‘భానుమతి రామకృష్ణ’ ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, 30 ఏళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా, రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు. వైవిధ్యమైన కథనంతో […]

Read More

‘కొంటె కుర్రాడు’ ఫస్ట్ లుక్​ రిలీజ్​

ఎస్ఎంఫోర్ ఫిలిమ్స్ బ్యానర్ లో మాస్ మహారాజ రవితేజ అభిమాని ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’ (ఓ లోఫర్ గాడి ప్రేమకథ) అనేది ఉపశీర్షిక. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో ట్రయాంగిల్ మాస్ లవ్ ఎంటర్​ టైనర్​గా ఈ చిత్రం తెరకెక్కుతోంది, బ్యానర్ లోగో, టైటిల్ పోస్టర్ లోగోను హైదరాబాద్ లోని సంస్థ ఆఫీసులో విడుదల చేశారు కొంటె కుర్రాడు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు […]

Read More

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ముగ్గురికి కరోనా

సారథి న్యూస్​, నాగర్ కర్నూల్: జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ మంగళవారం తెలిపారు. జిల్లాలోని వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి, నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి, బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచించిన చర్యలను పాటించాలని సూచించారు. వీరు ముగ్గురు […]

Read More

ఏం సేస్తిరి.. ఏం సేస్తిరి!

సారథి న్యూస్​, హైదరాబాద్​: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు పెద్దలు. ఆ తెలివితోనే ఎదుగుతున్నారు కొందరు. ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు విధిస్తే వాటినుంచి తప్పించుకొని ఎలా సంపాదించాలోననే ఆలోచనల కోసం వారి మెదడుకు పని పెడుతున్నారు. సర్కారు కంటే మెరుగ్గా ఆలోచన చేసి భారీగా సంపాదిస్తున్నారు. ఏపీలో దశలవారీగా మద్యనిషేధం విధించే క్రమంలో అక్కడి సీఎం మద్యం ధరలను భారీగా పెంచారు. దుకాణాల సంఖ్యను కూడా సగానికి సగం తగ్గించారు. దీంతో మద్యం కొనుగోలు చేయలేక […]

Read More