సారథి న్యూస్, రామడుగు: కరోనాతో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకొనే పరిస్థితి లేనందున తమను ఆదుకోవాలని హెచ్‌బీటీ ( అవర్లీ బేస్డ్ టీచర్స్) కోరారు. మంగళవారం వారు చొప్పదండి ఎమ్మెల్యే సంకె రవిశంకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీ చాలని జీతాలతో బతుకు వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌బీటీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు సత్యానందం, రమేశ్, రమణ, జ్యోతి , అరుణ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌కు కరోనా భయం పట్టుకున్నది. తాము నిర్వహించిన మాస్ట్ పరీక్షల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడందో బోర్డు ఆందోళనలో పడింది. నాన్ కాంటాక్ట్ క్రీడలను మొదలుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బోర్డు తమ ఆటగాళ్లను ఒక చోటికి చేర్చింది. కొంత మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 100 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడినట్టు తెలిసింది. అయితే ఈ ఏడు మందిలో […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్.. ఆర్థికశాఖపై సమీక్షించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపుపై సీఎం ఓ నిర్ణయం తీసుకోనున్నారు. రైతులకు ప్రకటించబోయే కొత్త పథకం, ఆర్థిక సౌలభ్యంపై అధికారులతో చర్చించే అవకాశం ఉన్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపుతో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవడంపైనా సీఎం కేసీఆర్ అధికారులతో చర్చలు జరపనున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురికి కరోనా సోకగా.. తాజాగా జిల్లా దవాఖానలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న మొత్తం 27 మంది నమూనాలను పరీక్షించగా.. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక స్టాఫ్ నర్స్ కు, సెక్యూరిటీ సిబ్బంది కరోనా పాజిటివ్ నిర్ధారణ […]
న్యూఢిల్లీ: కెప్టెన్‌గా వైఫల్యం.. దాంతో వచ్చిన ఒత్తిడి వల్ల బ్యాటింగ్‌లోనూ ఫామ్ కోల్పోవడంతో.. సారథిగా కొనసాగడానికి సచిన్ టెండూల్కర్ ఇష్టపడలేదని అప్పటి చీఫ్ సెలెక్టర్ చందూ బోర్డే వెల్లడించాడు. దీంతో సౌరవ్ గంగూలీని సారథిగా నియమించాల్సి వచ్చిందన్నాడు. ఇందులో ఎలాంటి రహస్యం లేకపోయినా.. అప్పట్లో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయన్నాడు. ‘అప్పట్లో ఆస్ట్రేలియా టూర్‌కు సచిన్ టెండుల్కర్ ను కెప్టెన్‌గా పంపించాం. కానీ అక్కడ సరైన ఫలితాలు రాకపోవడంతో.. ఇండియాకు వచ్చిన వెంటనే సారథిగా కొనసాగలేనని […]
క్రొయేషియా: టెన్నిస్ క్రీడలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. గత వారం నిర్వహించిన ఏడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో పాల్గొన్న గ్రిగర్ దిమిత్రోవ్ (బల్గేరియా), బోర్నా కొరిచ్ (క్రొయేషియా)లకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ టోర్నీలో ఆడిన ప్లేయర్లకు వైరస్ భయం పట్టుకుంది. అలాగే మ్యాచ్‌కు హాజరైన నాలుగు వేల మంది ప్రేక్షకుల్లో కూడా ఆందోళన మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ ఈ టోర్నీని ఏర్పాటు చేయడంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. […]
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ప్రాక్టీస్‌లోకి దిగుతున్నారు. తాజాగా మిడిలార్డర్ బాట్స్మన్ చతేశ్వర్ పుజారా.. ఔట్ డోర్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన సొంత ఊరిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. ‘మళ్లీ బ్యాట్ పట్టా. సుదీర్ఘంగా విరామం వచ్చినా.. స్టాన్స్ తీసుకుంటుంటే నిన్నటి రోజులాగానే అనిపిస్తోంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు.
న్యూఢిల్లీ: చైనా సామగ్రిని తాము వాడటం లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) స్పష్టం చేసింది. ఇక నుంచి తాము చైనా నుంచి ఎలాంటి పరికరాలను దిగుమతి చేసుకోబోమని స్పష్టం చేశారు. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్తో కూడిన నాలుగు వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ కోసం గతేడాది భారత సమాఖ్య.. చైనాకు చెందిన జేకేసీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ కంపెనీ పరికరాల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో వెయిట్ లిఫ్టర్లు వాటిని ఉపయోగించడం లేదు. ‘చైనా సామగ్రిని […]