సారథి న్యూస్, అలంపూర్: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన తెలంగాణలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చూడామణి సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం అర్చకులు మూసివేశారు. ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. శుద్ధి సంప్రోక్షణ తర్వాత ప్రత్యేకపూజలు చేసి మహా మంగళహారతితో సోమవారం ఆలయాన్ని తెరవనున్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా వాజేడ్ మండలంలో ఓ కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాజేడ్, వెంకటాపురం మండలాల్లో 16 మందితో సన్నిహితంగా ఉన్నాడని తెలుసుకుని వారితో పాటు వారి కుటుంబసభ్యులను హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.
సారథి న్యూస్, రామడుగు: దక్షిణ గంగానదిగా పేరున్న గోదారమ్మ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పరవళ్లు తొక్కి ఆదివారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా లక్ష్మిపూర్ గాయత్రి పంప్ హౌస్ వద్ద ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 22 పంపింగ్ కేంద్రాలు ఉన్న 96 పంపులు, మోటార్స్ ను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిచారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 40లక్షల ఎకరాలకు సాగునీరు, […]
శృంగార తార మియా మాల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ అనే చిత్రాన్ని తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా ఎలా ఉన్నా రూ.వంద టికెట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు. దీనితో లేట్ చేయకుండా ఆర్జీవీ మరోసారి ప్రేక్షకుల వీక్ నెస్ ను వాడుకోడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ‘నగ్నం’ అనే చిన్న సినిమాను ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళిని కాదు.. […]
సారథి న్యూస్, రామడుగు: యోగా ద్వారా వ్యక్తి మానసిక వికాస పరిపూర్ణ వికాసం సాధ్యమవుతుందని, శారీరక దృఢత్వం పెంపొందుతుందని విద్యావంతుల వేదిక కరీంనగర్ జిల్లా రామడుగు సభ్యులు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యోగా డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యోగ శరీరానికి మంచి ఔషధం లాంటిదన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగా 730 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఆదివారం 225 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు 3,861 ఉన్నాయి. మొత్తం 3,731 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 659 కరోనా పాజిటివ్ కేసులు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. జనగామ జిల్లాలో 34 కేసులు, రంగారెడ్డి జిల్లా 10, మేడ్చల్ జిల్లాలో 9 చొప్పును కేసులు […]
వాషింగ్టన్: ఇండియా – చైనా మధ్య గొడవలు మరింత సంక్లిష్టంగా మారాయని, రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్య చాలా పెద్దదే అని అన్నారు. అందుకే అమెరికా చర్చలు జరుపుతోందని, గొడవలు తీర్చేందుకు హెల్ప్ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మొదటిసారి ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరిన ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, ఏం జరుగుతుందో […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్ మోడీ’ అని ట్వీట్ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత కూడా […]