Breaking News

Day: June 15, 2020

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర […]

Read More

గీతకార్మికులకు ఎన్నో పథకాలు

సారథి న్యూస్​, వరంగల్​: సీఎం కె.చంద్రశేఖర్ రావు గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. హన్మకొండలోని హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మించిన కాకతీయగౌడ హాస్టల్ భవనాన్ని వారు సోమవారం ప్రారంభించారు. మొదటి నుంచీ గౌడ సామాజికవర్గం సామాజిక చైతన్యంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. భవనం ప్రారంభోత్సవాన్ని 50వేల మందితో నిర్వహిద్దామని అనుకున్నామని, కరోనా సమయంలో అది సాధ్యంకాలేదని అన్నారు. ప్రతిఒక్కరూ సామాజికవర్గం అభివృద్ధికి కృషిచేయాలన్నారు. […]

Read More

కంటి వైద్యుడికి కరోనా

వరంగల్ రూరల్ జిల్లా: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. జర్నలిస్టులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా వరంగల్​ జిల్లాకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మెరుగు సుధాకర్ కరోనా బారినపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ సుధాకర్ 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం సూర్యాపేట కరోనా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం

Read More

డిప్రెషన్​లోకి పాయల్​ ఘోష్​

తానూ ఐదేండ్లుగా డిప్రెషన్​తో బాధపడుతున్నానంటూ ఊస‌ర‌వెళ్లి’ చిత్రం ఫేమ్​ పాయ‌ల్ ఘోష్‌ ఓ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్​ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. తాను డిప్రెష‌న్‌కు గురైనప్పుడల్లా త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని పాయల్​ చెప్పుకొచ్చింది. మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య బాధ కలిగించిందని ట్వీట్​లో పేర్కొంది. 2009లో ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ ‘ఊసరవెల్లి’ సినిమాలో […]

Read More

సుశాంత్​ మృతి బాధించింది

ముంబై : బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్య తనను ఎంతో బాధించిందని శృంగార తార సన్నీలియోన్‌ పేర్కొన్నది. దీని గురించి ఏం రాయాలో.. ఏం స్పందించాలో తెలియడం లేదు అంటూ ట్విట్టర్​లో ఓ లేఖను విడుదల చేసింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారమని తాను భావించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నది.

Read More
విద్యుత్​ అధికారికి వినతిపత్రం అందిస్తున్న సీపీఐ నాయకులు

విద్యుత్​ బిల్లుల రద్దు చేయండి

సారథి న్యూస్, రామడుగు: లాక్​డౌన్​తో పనిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుత సమయంలో ప్రభుత్వం విద్యుత్​బిల్లులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సృజన్ కుమార్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ఎదుట కార్యకర్తలతోకలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంటే రాజేశం, మచ్చ రమేష్, తదితరులు పాల్గున్నారు.

Read More

నిర్మాతగా హరీశ్​ శంకర్

టాలీవుడ్​లో హీరోలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లుగా మారుతున్న విషయం తెలిసిందే. ఈసారి నిర్మాతగా హరీశ్​ శంకర్ కూడా వారి లిస్టులో చేరనున్నాడు. హరీశ్​ శంకర్ నిర్మాత అంటూ ప్రచారం జరుగుతోంది. హరీశ్​ బన్నీ వాసుతో కలిసి కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించబోతున్నాడట. ఒక సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని.. గీతా ఆర్ట్స్​తో కలిసి ఈ సినిమాను చేయాలనుకుంటున్నాడని టాక్. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే అటు సినీవర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగానే ఉండే […]

Read More

తమిళనాడులో మరోసారి లాక్​డౌన్​

సారథిన్యూస్​, హైదరాబాద్:​ రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి సంపూర్ణ లాక్​డౌన్​ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్​పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 39 వరకు సంపూర్ణ లాక్​డౌన్​ విధించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ సిబ్బందే.. ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లతోసహా అన్ని దుకాణాలు మూతపడనున్నాయి. హోటళ్లనుంచి పార్శిల్​ను మాత్రం […]

Read More