Breaking News

Day: June 11, 2020

పేద ముస్లింకు ఎన్​ఆర్​ఐ సాయం

సారథి న్యూస్, రామడుగు: ఓ నిరుపేద ముస్లిం మహిళకు ఎన్​ఆర్​ఐ ఆర్థికసాయం చేసి పెద్దమనసు చాటుకున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన ఎక్బల్​ శాహన సుల్తానా అనే మహిళ తన కూతరు హీనాకు వివాహం చేసేందుక ఇబ్బందులు పడుతుండగా.. గ్రామానికి చెందిన ఎన్​ఆర్​ఐ సత్యం రూ.20వేల ఆర్థిక సాయం అందజేశారు. నగదును గ్రామసర్పంచ్​ పంజాల ప్రమీల, సుల్తానాకు అందజేశారు. కార్యక్రమంలో​ కాంగ్రెస్​ నాయకులు నాగి శేఖర్​, ఖాజీసాహబ్​, మజీద్​ పాల్గొన్నారు.

Read More

జగన్.. ప్రజాబాట

సారథి న్యూస్, అనంతపురం: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు సచివాలయ వ్యవస్థ పనితీరుపై కూడా ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. జులై 8న దివంగత సీఎం వైఎస్​ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలు పంపిణీచేసి ఆ తర్వాతే ప్రజాక్షేత్రంలోకి […]

Read More
seeds

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే

సారథి న్యూస్, బిజినేపల్లి : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠినచర్యలు తప్పవని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ హెచ్చరించారు. గురువారం ఆయన బిజినేపల్లిలోని కనక దుర్గ ఏజెన్సీ , శ్రీరామ ట్రేడర్స్ , వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నీతితో కలిసి తనిఖీచేశారు. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ప్యాకెట్ పై తయారీ తారీఖును , బిల్లును కచ్చితంగా సరి చూసుకోవాలని కోరారు.

Read More

స్విస్, యూరోపియన్ ఓపెన్ రద్దు

న్యూఢిల్లీ: రివైజ్డ్ షెడ్యూల్లో సరైన విండో లేకపోవడంతో.. స్విస్ ఓపెన్, యూరోపియన్ ఓపెన్ టోర్నీలను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) రద్దు చేసింది. కరోనా ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. షెడ్యూల్ ప్రకారం స్విస్ ఓపెన్ మార్చి 17 నుంచి 22 వరకు, యూరోపియన్ టోర్నీ ఏప్రిల్ 21 నుంచి 26 వరకు జరగాల్సి ఉన్నాయి. ఇక గత కొద్ది నెలలుగా ఎలాంటి టోర్నీలు జరగకపోవడంతో.. మార్చి 17 నాటికి ర్యాంక్​లను […]

Read More

ఉమ్మి ప్రభావం ఉండదు

ముంబై: బంతిని రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిన వాడకపోవడం.. పరిమిత ఓవర్ల క్రికెట్​పై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. టీ20 ఫార్మాట్​లో ఇది పెద్దగా అవసరం పడదని చెప్పాడు. టెస్ట్ క్రికెట్​కు వచ్చేసరికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. ‘వన్డే ఫార్మాట్‌లో తెల్ల బంతి రెండు ఓవర్లు మాత్రమే స్వింగ్‌ అవుతుంది. టీ20లకు వస్తే పిచ్ రెండు, మూడు ఓవర్లు మాత్రమే బాగుంటుంది. దీనివల్ల మూడు ఓవర్లు బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. […]

Read More
venkanna

వెంకన్నకు డాక్టరేట్

సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి) : ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సురాబాద్ డివిజన్ కు చెందిన కందికంటి వెంకన్న ఈ నెల 20న బెంగళూరులో డాక్టరేట్ స్వీకరించనున్నారు. గత కొన్నేండ్లుగా ఆయన ఎన్నో సేవాకార్యక్రమాలను నిర్వహించారు. వీటిని గుర్తించిన ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వెంకన్నకు డాక్టరేట్​ ప్రదానం చేయనున్నదని ఉమ్మడి తెలుగు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆకుల రమేశ్​ తెలిపారు. యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్​ కే ఆశోక్ కుమార్, వీసీ, ప్రముఖుల ఆధ్వర్యంలో వెంకన్న డాక్టరేట్ ను […]

Read More

చెక్​బౌన్స్​కు ఇక నో కేస్​..

ఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యాపారవర్గాలకు కేంద్రప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. బ్యాంకు ఖాతాల్లో నగదు లేక చెక్​బౌన్స్​ కావడం, రుణాల చెల్లింపు నిబంధనల ఉల్లంఘన తదితర చర్యలను నేరాల జాబితా నుంచి తొలగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన 19 చట్టాల్లో సవరణలు చేయనున్నది. వీటిపై సంబంధిత వర్గాలు జూన్‌ 23లోగా తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. చిన్న నేరాలను డీక్రిమినలైజ్‌ చేయడం, వ్యాపారవర్గాలకు ఎంతో తోడ్పడుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. […]

Read More

ఫ్రెంచ్‌ కోసం యూఎస్‌కు జొకోవిచ్ డుమ్మా

లండన్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలగాలని సెర్బియా స్టార్ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ భావిస్తున్నాడు. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్ట్‌ 31 నుంచి యూఎస్‌ ఓపెన్‌ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో సన్నాహాకాలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఎంపిక చేసిన టోర్నీల్లో మాత్రమే ఆడాలని జొకోవిచ్ యోచిస్తున్నాడు. మరోవైపు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్.. మిగతా సీజన్​కు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. మోకాలి గాయానికి చేయించుకున్న ట్రీట్​మెంట్​ నుంచి […]

Read More