Breaking News

Day: June 3, 2020

తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

సారథి న్యూస్​, హుస్నాబాద్: మానవ తప్పిదాలతోనే తరచూ రోడ్డు యాక్సిడెంట్స్​ జరుగుతున్నాయని ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ అన్నారు. రోడ్డుపై వెళ్తుంటే ఏమాత్రం ఏమరపాటు మరిచినా ప్రమాదమేనని హెచ్చరించారు. హుస్నాబాద్ డివిజన్ లోని హుస్నాబాద్, కోహెడ, చేర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన రోడ్ యాక్సిడెంట్ ప్రదేశాలను బుధవారం ఆయన అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా అతివేగంతో నడపడం ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. స్పీడ్ లేజర్ గన్ ద్వారా వేగం […]

Read More

వ్యాయామంపై ఆన్​లైన్​ వర్క్​షాప్​

సారథి న్యూస్​, భద్రాద్రికొత్తగూడెం: యోగాసనాలు, ఎక్సర్ సైజ్​లు శరీరంలో మరింత శక్తిని పెంచుతాయని అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య అన్నారు. ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.కిష్టయ్య ఆధ్వర్యంలో బుధవారం హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ వారు వ్యాయామంపై ఆన్​లైన్​ వర్క్​షాప్​ నిర్వహించారు. వందమంది పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏవో వెంకటేశ్వర్లు, త్రిటౌన్ సీఐ ఆదినారాయణ, టుటౌన్ సీఐ సత్యనారాయణ, వన్​ టౌన్ సీఐ రాజు, జూలూరుపాడు […]

Read More

కించపరిచే రాతలు రాస్తే చర్యలు

మంగళగిరి: సోషల్ మీడియాపై గట్టి నిఘా పెట్టామని ఆంధ్రప్రదేశ్​ డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులను కించపరుస్తూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు తప్పు అయితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగతంగా దూషిస్తే క్రిమినల్​ కేసులు నమోదు చేస్తామన్నారు. నిరాధారమైన వార్తలు రాస్తే 9071666667 నంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు. లాక్ డౌన్ వలన సోషల్ మీడియా హవా కొనసాగిందని, దీని […]

Read More

పట్టణ ప్రగతిపనుల పరిశీలన

సారథి న్యూస్​, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి మున్సిపల్ కేంద్రంలో చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఇన్​చార్జ్​ కమిషనర్ సరిత బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా మురికి నీటి కాల్వల్లో పెరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు.

Read More

భౌతిక దూరం పాటించండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్​ పి.నల్లనయ్య అన్నారు. కరోనా నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. మురుగు నీటి కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని, బ్లీచింగ్ ప్రతిరోజూ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరి కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు.

Read More

శ్రీకాకుళం కలెక్టర్​ కు ప్రతిష్టాత్మక అవార్డు

సారథి న్యూస్, శ్రీకాకుళం: మూగజీవాలను ఆదుకునే క్రమంలో అంకితభావంతో సేవచేసే వారికి గ్రీన్ మెర్సీ సంస్థ అరుదుగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘యాక్షన్ ఫర్ ఎనిమల్స్’ అవార్డుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఎంపికయ్యారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ముఖ్య​ అధికారి రమణమూర్తి ఈ అవార్డును కలెక్టర్​కు అందజేశారు. మూగజీవాల ఆకలిబాధ తీర్చేందుకు కలెక్టర్​ చేపడుతున్న కార్యక్రమాలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, జిల్లా సివిల్​ సప్లయీస్​ ఆఫీసర్​ ఎల్.రమేష్ ఇతర […]

Read More

పశువులకు టీకాలు తప్పనిసరి

సారథి న్యూస్, మెదక్: పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధినిరోధక టీకాల పంపిణీ ప్రక్రియను ఈనెల 10వ తేదీ వరకు పూర్తిచేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా పశువైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో పాడి రైతులు, మేకలు, గొర్రెల కోసం హరితహారం కార్యక్రమంలో తుమ్మ, సుబాబుల్, అవిసె, సూపర్ నేవియర్ గడ్డివేయాలని సూచించారు. అధికారులు ఈ సీజన్​లో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాడి పశువులకు బీమా చేయించే విషయమై అవగాహన […]

Read More

శాంతియుతంగా నిరసనలు తెలపండి

వాషింగ్టన్‌: ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన తెలపాలని అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ రూల్స్‌ను పాటించాలని మెలానియా ట్రంప్‌ కోరారు. ‘కలిసికట్టుగా పనిచేస్తేనే అన్నినగరాల్లో ప్రజలకు భద్రత కల్పించగలం. అందరూ వీధులు వదిలి ఇళ్లలోకి వెళ్లండి. ఫ్యామిలీతో గడపండి’ అని మెలానియా ట్వీట్‌ చేశారు. అమెరికన్లు గొడవకు దిగొద్దని ఆమె రిక్వెస్ట్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళనలను అమెరికా స్వాగతిస్తుందని, హింస వద్దని ఆమె మరో ట్వీట్‌ చేశారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ […]

Read More