కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌ను మళ్లీ మొదలుపెట్టేందుకు శ్రీలంక బోర్డు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే 13 మంది క్రికెటర్లతో ఔట్‌డోర్ ట్రైనింగ్ మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. కొలంబో క్రికెట్ క్లబ్‌లో జరిగే ఈ ‘రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్యాంప్’ కోసం ఎక్కువ మంది బౌలర్లను ఎంపికచేశారు. ‘మూడు ఫార్మాట్లకు సంబంధించిన క్రికెటర్లు ఇందులో ఉన్నారు. టోర్నీల్లో పాల్గొనడానికి బౌలర్లకు ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. ప్రతి గ్రూపులో నలుగురు క్రికెటర్లు ఉంటారు. వీళ్ల ప్రాక్టీస్‌ను కోచ్, సహాయక సిబ్బంది పర్యవేక్షిస్తుంది. మా ప్రభుత్వం […]
కరాచీ: పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ బ్యాన్ అప్పీల్ కేసును విచారించేందుకు స్వతంత్ర విచారణాధికారిని నియమించారు. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఫకీర్ మహ్మద్ ఖోకర్.. ఈ కేసును విచారిస్తారని పీసీబీ వెల్లడించింది. విచారణ తేదీని ఆయనే నిర్ణయిస్తారని తెలిపింది. ఇప్పటికే తన తరఫున వాదనలు వినిపించేందుకు.. ప్రధాని పార్లమెంట్ అఫైర్స్ సలహాదారు బాబన్ అవాన్‌కు చెందిన న్యాయసంస్థను ఉమర్ ఆశ్రయించాడు. ఈ కేసులో తన తప్పులేదని తేలుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ […]
సారథి న్యూస్, వరంగల్: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విస్తృతంగా పర్యటించారు. గ్రామాలను సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాల్వల్లో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీసీ బస్సులను పరిశీలించారు. మాస్కులు లేకుండా వచ్చేవారిని బస్సుల్లోకి ఎక్కించుకోకూడదని సూచించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
సారథి న్యూస్, కరీంనగర్: మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మిడ్ మానేరు లింక్ కెనాల్ కు మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భూమిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తలమానికంగా తెలంగాణ తల్లి మండపం జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సిద్ధం సారథి న్యూస్, నర్సాపూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ప్రతీకగా హత్నూర మండలం కాసాల-దౌల్తాబాద్ శివారులోని చౌరస్తాలో తెలంగాణ తల్లి మండపాన్ని ఏర్పాటుచేశారు. టీఆర్ఎస్ అనుబంధ, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవులపల్లి గ్రామానికి చెందిన పొట్టి జనార్దన్ రెడ్డి ఈ మందిరం నిర్మాణానికి విశేషంగా కృషిచేశారు. 2010 సెప్టెంబర్ 13న అప్పటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కె.చంద్రశేఖర్ రావు […]
న్యూఢిల్లీ: మూడేళ్లుగా రెజ్లింగ్‌లో నిలకడగా రాణిస్తున్న భారత రెజ్లర్ వినేశ్ పోగట్.. వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆమె పేరును సిఫారసు చేస్తున్నామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తెలిపింది. ఈ అవార్డు కోసం గతేడాది కూడా వినేశ్ పోటీపడినా.. బజ్రంగ్ పూనియాకు వరించింది. దీంతో ఈసారైనా తనకు అతిపెద్ద క్రీడాపురస్కారం దక్కుతుందని వినేశ్ ఆశాభావం వ్యక్తం చేసింది. జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన […]
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి అని అతని భార్య సాక్షి వెల్లడించింది. ఆట గురించి ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటాడని చెప్పింది. ఎక్కడున్నా సహచరులకు సాయం చేయడానికి ముందుంటాడని పేర్కొంది. ‘క్రికెట్ ఉంటే ధోనీ వేరే విషయాలు పట్టించుకోడు. ఆట అంటే అతనికి అంత ఆసక్తి. ఒకవేళ ఖాళీ దొరికితే వీడియోగేమ్స్ ఆడుతుంటాడు. ఒత్తిడిని ఉపశమనం పొందడానికి అది ఓ మార్గంగా భావిస్తాడు. ఇటీవల విరామం రావడంతో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. […]
రెండు నెలల్లో రూ.50లక్షలకు పైగా ఆదాయం నష్టం ఉద్యోగులకు మూడునెలలుగా సగం జీతమే చెల్లింపు భక్తుల కోరికపై ఆన్‌లైన్ ద్వారా అమ్మవారికి పూజలు సారథి న్యూస్, విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు పైడితల్లి అమ్మవారి ఆలయానికి కరోనా ఎఫెక్ట్ తగిలింది. మార్చిలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని మూసివేశారు. దీంతో భక్తుల ద్వారా వచ్చే లక్షల ఆదాయానికి గండిపడింది. ఆలయ హుండీల ద్వారా వచ్చే […]