– వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం హోల్డింగ్ న్యూఢిల్లీ: ప్రతి ఒక్కరికి క్రికెట్ డబ్బుల వనరుగా మారిందని, దీనివల్ల ఆట ప్రతిష్ట మసకబారిపోతోందని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆట వల్ల అందుబాటులో ఉండే ప్రతి పైసాను పిండుకోవాలని చూస్తున్నారని ఆరోపించాడు. కనీసం కరోనా బ్రేక్ లోనైనా క్రికెట్ ఏ దారిలో వెళ్తుందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరాడు. ‘క్రికెట్ పూర్తి కమర్షియల్ అయిపోయింది. దీనివల్ల మనుగడ కష్టంగా మారుతోంది. అందుకే కొంత […]
కోల్కతా: ఇండియా ఫుట్ బాల్ మాజీ ఆటగాడు చున్నీ గోస్వామి గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. గత కొన్నేళ్లుగా మధుమేహం, నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కలకత్తాలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నాడు. 1956–64 మధ్య ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన గోస్వామి 50 మ్యాచ్ లూ ఆడాడు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ ను విజేతగా నిలపడంతో గోస్వామి పేరు మార్మోగిపోయింది. ఫుట్ బాల్ తో పాటు క్రికెట్ పై మక్కువ […]
– ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సారథి న్యూస్, షాద్ నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్నగర్ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: లాక్ డౌన్ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. మండలాల వారీగా కలెక్టరేట్లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో వైద్యులు, పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం మే డే సందర్భంగా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు వారి మిత్రబృందం మున్సిపల్ కార్మికులకు అన్నదానం నిర్వహించడంతో అభినందించారు. కరోనా కట్టడికి […]
సారథి న్యూస్, చేవెళ్ల: ఉరుముల, మెరుపులతో భారీవర్షం పడడంతో పిడుగు పడి ఎద్దు మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మొగులయ్య కాడెద్దులను పొలంలో కట్టేశాడు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పాటుకు ఎద్దు చనిపోయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.
సారథి న్యూస్, వెల్దండ: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం– హైదరాబాద్ హైవేపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను శుక్రవారం డీఆర్వో మధుసూదన్ నాయక్, ఆర్డీవో రాజేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలు సేకరించాలని, మండలంలో ఉన్న వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని సూచించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్సార్ పింఛన్ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.87.38 కోట్లు పంపిణీ చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 3,65,334 మందికి రూ.87.38 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.