న్యూఢిల్లీ: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరును ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించింది. ఓపెనర్ శిఖర్ ధవన్, సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ పేర్లను అర్జున పురస్కారాలకు సిఫారసు చేసింది. మహిళల విభాగంలో ఆల్ రౌండర్ దీప్తిశర్మ అర్జునకు నామినేట్ అయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఐదుసెంచరీలు చేయడంతో బీసీసీఐ ఏకగ్రీవంగా అతని పేరును సిఫారసు చేసింది. ఇక 2018లో స్మృతి మంధనతో పాటు ధవన్ పేరును అర్జునకు ప్రతిపాదించినా అవార్డు […]
న్యూఢిల్లీ: ఐపీఎల్లో విదేశీ స్టార్లు ఆడకపోతే కళ తప్పుతుందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. ఈ లీగ్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని, అందుకే అందరూ పాల్గొనాలని సూచించాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌పై ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే అది తొందరపాటే అవుతుంది. భారత్ తయారుచేసిన ఓ అంతర్జాతీయ ఈవెంట్ ఈ లీగ్. ప్రపంచ క్రికెట్‌కే ఇది తలమానికం. క్రికెట్లో ప్రీమియర్ ఈవెంట్ కూడా. అందుకే విదేశీ క్రికెటర్లు కచ్చితంగా ఉండాల్సిందే. […]
న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్‌గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్‌గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్‌లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. […]
కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్‌కు మందుల్లేవ్. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి. మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా […]
లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ‘కరోనా సబ్ స్టిట్యూట్’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్‌ల్లో కంకూషన్ సబ్ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై […]
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ పై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఈ మూవీ రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇక బాలయ్య, రానా వంటి హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో సూర్య దక్కించుకున్నారట. తమ్ముడు కార్తీతో కలిసి ఆయన ఈ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక తాగుబోతు వ్యక్తికి ఒక పోలీస్ […]
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈసారి మైండ్ బ్లాక్ అంటున్నాడు. టాలీవుడ్ హిట్ పాటలకు స్టెప్పులేస్తూ.. అదరగొడుతున్న వార్నర్ తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ సాంగ్’కు తన భార్య క్యాండీస్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ను విడుదల చేశాడు. కష్టమైన ఈ డ్యాన్స్ బీట్ కోసం 51 టేక్స్ తీసుకున్నట్లు చెప్పాడు. […]