Breaking News

బాసర త్రిబుల్​ ఐటీలో అగ్నిప్రమాదం

సారథి న్యూస్​, ఆదిలాబాద్​: నిర్మల్ జిల్లాలోని బాసర త్రిబుల్​ ఐటీలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. అకాడమిక్ బ్లాక్ క్లాస్ రూమ్ లో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ జరగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో క్లాస్ రూమ్ లోని ఫర్నిచర్, ప్రొజెక్టర్, సుమారు 60 నుంచి70 చైర్లు, 21 టేబుళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. క్యాంపస్ మొత్తం పొగలతో కమ్ముకుంది. అలర్ట్​ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించింది. తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై ఆరా తీస్తున్నారు.