Breaking News

Month: May 2020

పోడు పంచాయితీ

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో పోడు భూముల చుట్టూ శనివారం ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్​ చుడుతుండగా రైతులు, అధికారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఒకరు గాయపడ్డారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని స్థానిక సీపీఎం నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

Read More

ఆఫీసుకు వస్తే మాస్క్​ ఉండాలె

సారథి న్యూస్​, కౌడిపల్లి: వివిధ అవసరాలకు ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా మాస్క్​ కట్టుకోవాలని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ నగేష్ సూచించారు. శనివారం కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసును సందర్శించారు.వెంకటాపూర్ ఆర్ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సేకరించిన భూములను ఇరిగేషన్​ శాఖ పేర బదిలీచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్​ రాణా ప్రతాప్ సింగ్, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి ఉన్నారు.

Read More

మే ఫుల్​ జీతం ఇవ్వండి

సారథి న్యూస్, ఆదిలాబాద్: మే నెల పూర్తిజీతం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్​ ఆఫీసు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. లాక్​ డౌన్​ పేరుతో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత అమలవుతోందని ఆక్షేపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జిల్లా […]

Read More

శార్దూల్.. ప్రాక్టీస్ షురూ

ముంబై: లాక్​ డౌన్​తో రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ ఎట్టకేలకు శనివారం స్థానిక బోయ్​ సర్​ మైదానంలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దీనికి బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నాడో లేదో తెలియదు. లాక్​ డౌన్​ తర్వాత ట్రైనింగ్​ మొదలుపెట్టిన భారత క్రికెటర్ శార్దూల్ కావడం విశేషం. లాక్​ డౌన్​ సడలింపుల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో స్టేడియాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.దీంతో శార్దూల్.. కొంతమంది దేశవాళీ క్రికెటర్లతో కలిసి ప్రాక్టీస్ […]

Read More

ధోనీని గుర్తుకు తెస్తాడు

వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా ముంబై: ఐపీఎల్లో చెన్నై సూపర్​ కింగ్స్​కు పోటీ ఇవ్వగల జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్​ రాకతో మరింత బలంగా తయారైన ముంబై.. నాలుగుసార్లు టైటిల్స్​ను కూడా కొల్లగొట్టింది. అయితే కెప్టెన్సీ విషయంలో కొన్నిసార్లు రోహిత్.. ధోనీని గుర్తుకు తెస్తాడని వెటరన్ ప్లేయర్ సురేశ్ రైనా అన్నాడు. కొన్ని లక్షణాలు అచ్చం మహీని పోలి ఉంటాయన్నాడు. ‘ప్రశాంతత, ఆటగాళ్లకు ప్రేరణ కల్పించడంలో ధోనీలాగా వ్యవహరిస్తాడు. కెప్టెన్సీ కూడా […]

Read More

పూజారాను ఔట్ చేయాల్సిందే

ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాను ఈసారి ఎలాగైనా ఔట్​ చేయాల్సిందేనని ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అందుకోసం కొత్త మార్గాలు వెతుకుతున్నానని చెప్పాడు. గత సిరీస్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేయనివ్వబోనని స్పష్టం చేశాడు. ‘సాధ్యమైనంత వరకు పుజారా ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రయత్నిస్తాడు. బ్యాటింగ్​లో ఆందోళన చెందడు. ఈ ప్రత్యేకత వల్లే పరుగుల వరద పారిస్తున్నాడు. అందుకే మేం అతన్ని ఔట్ చేసేందుకు […]

Read More

ఐపీఎలే బెస్ట్

ఇంగ్లండ్ బ్యాట్స్​మెన్ జోస్ బట్లర్ న్యూఢిల్లీ: ఇంగ్లండ్ క్రికెట్ బాగా అభివృద్ధి చెందడానికి ఐపీఎల్ చాలా దోహదపడిందని ఆ దేశ బ్యాట్స్​మెన్​ జోస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్​ల తర్వాత ఐపీఎల్ బెస్ట్ టోర్నీ అని కితాబిచ్చాడు. ఈసారి లీగ్ జరిగితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఇంగ్లిష్ క్రికెట్ పురోగతి సాధించడానికి ఐపీఎల్ చాలా సాయం చేసింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కొన్నేళ్లుగా ఎంతో మంది క్రికెటర్లు ఇందులో ఆడుతున్నారు. వాళ్లంతా ఆటపరంగా, ఆర్థికంగా చాలా […]

Read More

బౌలర్లకు రెండు నెలలు పట్టొచ్చు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముంబై: బౌలర్లు పూర్తి స్థాయిలో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే కనీసం రెండు నెలల ప్రాక్టీస్ అవసరమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వెల్లడించింది. గాయాల బారినపడకుండా ఉండాలంటే ఇది కచ్చితంగా అవసరమని చెప్పింది. ‘లాక్​ డౌన్​ కారణంగా బౌలర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కనీసం రన్నింగ్ ప్రాక్టీస్ కూడా లేదు. ఇప్పటికిప్పుడు టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టాలంటే వాళ్లకు పెద్ద రిస్క్ ఉంటుంది. గాయాల బారినపడతారు. అందుకే ముందు చిన్నచిన్న కసరత్తులు మొదలుపెట్టి పూర్తిస్థాయి రన్నింగ్ […]

Read More