Breaking News

Month: May 2020

కాల్వల పనులు కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, మెదక్: కొండపోచమ్మ జలాశయానికి గోదావరి జలాలు వచ్చిన నేపథ్యంలో సంగారెడ్డి, రామాయంపేట ప్రాంతాల్లో కాల్వ పనులను తొందరగా పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కోమటిబండపై మిషన్ భగీరథ భవన్ లో ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ వేణుతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూసేకరణకు […]

Read More

బీజేపీ మెదక్ జిల్లాకు కొత్త సారథి

సారథి న్యూస్, మెదక్: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మెదక్ జిల్లాకు గడ్డం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గడ్డ శ్రీనివాస్ పార్టీలో కార్యకర్తస్థాయి నుంచి జిల్లా అధ్యక్ష స్థాయి వరకు ఎదిగారు. గతంలో ఉమ్మడి మెదక్ మండలాధ్యక్షుడిగా మూడుసార్లు, మెదక్ ఉమ్మడి జిల్లా వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. పార్టీకి అందించిన సేవలకు […]

Read More
నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై: కరోనా వ్యాప్తి చెండటంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాపించిందని అన్నారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్‌ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసే బాధ్యతను మాత్రం రాష్ట్రలపైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని […]

Read More
బస్సులకు అనుమతి లేదు

బస్సులకు అనుమతి లేదు

తమిళనాడు సర్కార్‌‌ నిర్ణయం చెన్నై: లాక్‌డౌన్‌ 5కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది. రాష్ట్రంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. జూన్‌ 8 తర్వాత పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు.దేవాలయాలు, మెట్రో, ఇంటర్‌‌ స్టేట్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, సబ్‌ అర్బన్‌ ట్రైన్స్‌పై […]

Read More
మోడీ బయోగ్రఫీ రిలీజ్

మోడీ బయోగ్రఫీ రిలీజ్

-ఇంటర్ నెట్‌లో రిలీజ్‌ చేసిన రిటైర్డ్‌ జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ చిన్ననాటి ఫొటోలు, ఆయన గురించి ఎవరికి తెలియని విషయాలను తెలియజేస్తూ రూపొందించిన మోడీ బయోగ్రఫీని రిటైర్డ్ జస్టిస్‌ కేజీ. బాలకృష్ణన్‌ రిలీజ్‌ చేశారు. ‘నరేంద్ర మోడీ.. హర్బింజర్‌ ఆఫ్‌ ప్రాస్ పెరిటీ అండ్‌ అపాస్టిల్‌ ఆఫ్‌ వరల్డ్‌ పీస్‌’ పేరుతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. ఇంటర్ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ జ్యురిస్ట్‌ అండ్‌ ఛైర్మన్‌ ఆఫ్ ఆల్‌ ఇండియా బార్‌‌ […]

Read More
'మోడీ మన్‌ కీ బాత్‌' వినండి

‘మోడీ మన్‌ కీ బాత్‌’ వినండి

ప్రజలు ఇప్పుడు ఇంకా అప్రమత్తంగా ఉండాలని సూచన మిడతల దాడితో నష్టపోయిన వారిని ఆదుకుంటాం న్యూఢిల్లీ: కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రపంచం మొత్తానికి యోగా, ఆయుర్వేద సామర్థ్యం తెలిసొచ్చిందని మోడీ చెప్పారు. ‘కరోనా వైరస్‌ సంక్షోభంలో ప్రపంచంలోని చాలా మంది లీడర్లతో మాట్లాడాను. వాళ్లంతా ఆయుర్వేదం, యోగాపై ఇంట్రెస్ట్‌ చూపించారు. ఈ టైంలో యోగా, ఆయుర్వేదం ఎలా ఉపయోగపడిందో తెలుసుకున్నారు. ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. హాలీవుడ్‌ నుంచి హరిద్వార్‌‌ వరకు ప్రతి ఒక్కరు యోగాను నేర్చుకున్నారు’ […]

Read More
ఒలింపిక్స్‌ చాంపియన్ మోరో మృతి

ఒలింపిక్స్‌ చాంపియన్ మోరో మృతి

టెక్సాస్‌: 1956 ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన బాబీ జో మోరో(84) మరణించారు. టెక్సాస్‌లోని తన సొంత ఇంట్లో ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారన్నారు. 1955 అమెచ్యూర్‌‌ అథ్లెటిక్‌ యూనియన్‌ 100 మటర్ల పందేన్ని గెలుచిన మోరో.. 1950లలో అత్యంత ఆధిపత్య స్ర్పింటర్లలో ఒకరు. 1956లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మోడో మూడు స్వర్ణాలు సాధించారు. అదే అతడి అత్యంత విజయవంతమైన ఏడాది.

Read More

ఆగస్టు 8న రానా పెళ్లి

దగ్గుబాటి వారి ఇంట్ల ఇక పెళ్లి బాజా మోగనుంది. రానా, మిహికా బజాజ్ ఏడడుగులు నడవనున్నారు. ​ఇరువురి మోములో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల రామానాయుడు స్టూడియోలో రోకా వేడుక అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 8న మంచి ముహూర్తం ఉండడంతో పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించారు. ‘కరోనా సమయంలో ఎక్కడికి వెళ్లలేం కదా.. హైదరాబాద్​లోనే పెళ్లివేడుక ఉంటుంది’ రానా తండ్రి, ప్రముఖ నిర్మాణ దగ్గుబాటి సురేశ్​బాబు వెల్లడించారు

Read More