గుండెపోటుతో కొడుకు వెంకటేష్ మృతి ప్రముఖ సీనియర్ నటి, కళాభినేత్రి వాణిశ్రీ ఇంట్లో పెనువిషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో కొడుకు మృతిచెందాడు. 2004లో తారకరత్న సినిమా ‘భద్రాద్రి రాముడు’లో కనిపించారామె. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వాణిశ్రీకి కుమార్తె అనుపమ, కుమారుడు అభినయ వెంకటేష్ ఇద్దరు పిల్లలు. వెంకటేష్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో తన స్టడీస్ పూర్తిచేసి ప్రస్తుతం ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెంకటేష్ భార్య కూడా వైద్య వృత్తిలోనే ఉన్నారు. […]
ఎలాంటి క్యారెక్టర్లోకైనా పరకాయ ప్రవేశం చేసేస్తాడు రానా. ‘అరణ్య’ సినిమా రిలీజై ఉండి ఉంటే రానా పర్ఫామెన్స్ తో థియేటర్లు దద్దరిల్లి ఉండేవి. లాక్ డౌన్ ఆ ఆనందాన్ని లేకుండా చేసేసింది. దాన్ని బ్రేక్ చేయడానికేమో అంతకంటే ఎంజాయ్ మెంట్ కలిగించాడు తన పెళ్లి వార్తతో. మిహికాతో తనకున్న ప్రేమను బయట పెట్టి ఆఖరికి పెద్దల వరకూ తీసుకెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసుకున్నాడు. ఇంతకీ ఈ మిహికా ఎవరు? అత్త కూతురా? లేదా పక్కింటి అమ్మాయా? ఎలా […]
అమితాబచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం ‘గులాబో సితాబో’. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రోని లాహిరి, షీల్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీని జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నారు. శనివారం విడుదలైన ట్రైలర్ మాత్రం అంచనాలను పెంచేదిగా ఉంది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ సరదాగా సాగిపోయే సన్నివేశాలతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అమితాబ్ ఒక పాత […]
ప్రపంచవ్యాప్తంగా కరోనా(కోవిడ్–19) ప్రజలను వణికిస్తోంది. ఇంకా మెడిసన్ నోచుకుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ రక్షించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ గర్భిణులకు ఈ వ్యాధి సోకితే ఏం చేయాలి. అందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో జరిగిన వైద్యుల సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య వివరించారు.ఆ ఆలోచనే వద్దు..అతి భయంకరమైన ఈ కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలేవీ కనిపించడం లేదు. ఒకవేళ ఈ […]
‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది కీర్తిసురేష్. అప్పటి నుంచి తన సినిమాలన్నీ ఆచితూచి ఎన్నుకుంటోంది. ప్రస్తుతం కీర్తి చేతిలో చాలా మంచి సినిమాలే ఉన్నాయి. వాటిలో బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ హీరోగా రవీంద్రనాథ్ శర్శ డైరెక్షన్ లో ‘మైదాన్’ స్పోర్ట్స్ బయోపిక్ ఒకటి, తెలుగులో నితిన్ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’, నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్లక్ సఖి’, నరేంద్ర నాథ్ డైరెక్షన్లో ‘మిస్ ఇండియా’ సినిమాలు.. […]
అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు కట్టడం తప్పదమే ఏపీ ప్రభుత్వతీరు విభజన చట్టానికి విరుద్ధం ‘కృష్ణా’ బోర్డులో ఫిర్యాదుచేస్తం కనీసం మమ్మల్ని సంప్రదించలేదు ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]
రన్నింగ్ ట్రాక్ లో స్వర్ణాల పంట అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్ అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్‌పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా […]
బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తోంది ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అదితీ రావు హైదరి. ఆమె అందం, అభినయానికి అభిమానులు మిలియన్ల లెక్కలో ఉన్నారు. అలాగే తను ఎంచుకునే క్యారెక్టర్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం నాని సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న ‘వి’ సినిమాలో నటిస్తోంది. అదీ నెగెటివ్ పాత్ర చేస్తోంది. తమిళంలో తుగ్లక్ దర్బార్, హే సినామిక, పొన్నియన్ సెల్వం సినిమాలకు […]