ఉపాధి కూలీల నిరసన సారథి న్యూస్, నర్సాపూర్: ఉపాధి హామీ పనులకు సంబంధించి కూలి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి చెందిన 242 మంది ఉపాధి కూలీలు కౌడిపల్లి ఎంపీడీవో ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు. కరోనా సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అనంతరం ఎంపీడీవో కోటిలింగం, జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, ఎంపీపీ రాజు నాయక్, వైస్ ఎంపీపీ నవీన్ […]
చేవెళ్ల సర్పంచ్ శైలజాఆగిరెడ్డి సారథి న్యూస్, చేవెళ్ల: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత అందరిపై ఉందని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి సూచించారు. శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలనీలతో పాటు షాపుల ఎదుట పరిశుభ్రతను పాటించాలని సర్పంచ్ సూచించారు. తడి పొడి చెత్తను వేరుచేసి పంచాయతీ వాహనంలో వేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సున్నపు వసంతం, […]
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులను సినీరంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గురువారం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్ రాజు, […]
పార్టీ శ్రేణులకు ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపు సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 23వ తేదీకి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శుభాకాంక్షలు తెలిపారు. 23న అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు, మండల కేంద్రాల్లో పార్టీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. శ్రేణులు పేదలకు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ […]
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు సారథి న్యూస్, అనంతపురం: కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చేసే దీక్షలు వృథా అని విమర్శించారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో వారికే తెలియదని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు […]
చాలెంజింగ్ రోల్స్‌ను ఎక్కువగా ఇష్టపడే రెజీనా కాసాండ్రా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అ, ఎవరు సినిమాలతో ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ‘నాట్ సో లేట్’ అన్న పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో లైవ్ నిర్వహిస్తోంది రెజీనా. వినూత్నమైన ఈ ప్రయోగానికి ఆమె అభిమానులు ముగ్ధులైపోతున్నారు. ఈ షోలో ఇండియన్ డ్రాగ్ పెర్ఫార్మర్ మయమ్మాతో లైవ్ షో నిర్వహించింది. అందుకోసం రెజీనా కూడా అచ్చం […]
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు. ప్రజెంట్ సిట్యుయేషన్ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. […]
సారథి న్యూస్, గోదావరిఖని: స్వర్గీయ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మహిళా కాంగ్రెస్ రామగుండం అధ్యక్షురాలు, కార్పొరేటర్ గాధం విజయానంద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్‌గాంధీ చేసిన సేవలను కొనియాడారు.