Breaking News

Day: May 18, 2020

కరోనా రోగులపై వివక్ష వద్దు

కరోనా రోగులపై వివక్ష వద్దు

– ఏపీ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి సారథి న్యూస్, అనంతపురం: కరోనా పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోయేందుకు తీసుకునే చర్యలపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కరోనా ప్రబలిన వారిపై వివక్ష చూపడం సరికాదని, వైఖరిలో మార్పు తీసుకురావాలన్నారు. కోవిడ్‌-19 నియంత్రణ చర్యలపై సీఎం జగన్‌ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, […]

Read More
మగ్గం.. ఆగమాగం

మగ్గం.. ఆగమాగం

కరోనాతో చేనేత, జౌళి పరిశ్రమ విలవిల గోదాముల్లో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు పెట్టుబడుల్లేక చేతులెత్తేస్తున్న మాస్టర్‌ వీవర్స్‌ సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని చేనేత, జౌళి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయా రంగాల మీద ఆధారపడి పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది కార్మికులు ఇప్పుడు రోడ్డునపడినట్లయింది. సాధారణంగా ఈ సీజన్‌లో పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని ఉంటుంది. కానీ కరోనా దెబ్బకు […]

Read More
జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

జులై 10 నుంచి టెన్త్​ ఎగ్జామ్స్​

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదింపు ప్రతిపేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. సారథి న్యూస్, అమరావతి: పదవ తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌నేపథ్యంలో 11 పేపర్లను ఆరు పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూనే జులై 10 నుంచి 15వ తేదీ వరకు ఎగ్జామ్స్​ నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రతి ఎగ్జామ్​ ఉదయం 9.30 నుంచి 12.45 […]

Read More
నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం

– సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ సారథి న్యూస్​, గోదావరిఖని: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వానాకాలంలో నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. వ్యవసాయరంగ సంబంధిత అంశాలపై శనివారం ఆయన కలెక్టర్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్​, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీపీసీ మిలీనియం హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వానాకాలం పత్తి, […]

Read More
రక్తదాన శిబిరం సక్సెస్​

రక్తదాన శిబిరం సక్సెస్​

సారథి న్యూస్​, గోదావరిఖని: టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ సూచనల మేరకు పెద్దపెల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మంథని ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ప్రారంభించారు. అంతకుముందు ఎన్​టీపీసీ మిలీనియం హాల్​లో నూతన వ్యవసాయ విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి నారాయణ, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్​ […]

Read More

టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ

సారథి న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హెచ్​ఎంలు, టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్​ డీఈవో ఏ.రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా కోవిడ్ –19  మానసిక సంసిద్ధతపై క్లాసెస్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని స్కూళ్ల నుంచి టీచర్లు హాజరుకావాలని సూచించారు. ఈనెల 17వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Read More
మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, ఆదిలాబాద్: బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు.  మహారాష్ట్రలోని పుసద్ కు చెందిన కళావతి శేశరావ్ ఢగే(65) ఆదిలాబాద్​లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె మృతిచెందడంతో మానవతా హృదయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు.

Read More
‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

‘నూడా’ కార్యకలాపాలు వేగవంతం

చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి సారథి న్యూస్​, నిజామాబాద్​: నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ కార్యకలాపాలు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా జరిగేందుకు నూడా పరిధిని నార్త్, సౌత్ జోన్ గా విభజించాలని నిర్ణయించినట్లు చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శనివారం నూడా ఆఫీసులో వైస్ చైర్మన్ జితేష్ వి.పాటిల్, సీపీవో జలంధర్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ లేఅవుట్లను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బోర్డు […]

Read More