– ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నివాళి సారథి న్యూస్, అనంతపురం: ఫిలిప్సైన్స్ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రేవంత్ కుమార్(22) మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కదిరి, అనంతపురం పట్టణాలకు చెందిన రేవంత్‌కుమార్(22), వంశీ(19) ఫిలిప్సైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. […]
ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సారథి న్యూస్, అనంతపురం: కరోనా(కోవిడ్-19) తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తాన్ని మూడు జోన్లుగా విభజించింది. వాటికి రెడ్ జోన్, ఆరంజ్ జోన్, గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించింది. తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్, కేసులు నమోదుకాని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్లలో ఈనెల 4వ తేదీ […]
సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల […]
సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,525కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 33 మరణాలు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా నుంచి కోలుకుని 441 మంది డిశ్చార్జ్ కాగా, 1,051 మంది కరోనా వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కర్నూలులో కొత్తగా 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో ఆరు, […]
సారథి న్యూస్, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జయహో మహిళా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణులకు పండ్లు, కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్ టౌన్ ఏఎస్సై శారద, జయహో మహిళా అధ్యక్షురాలు జక్కిని శ్రీలత, కానిస్టేబుల్ సుమలత, అంగన్వాడీ టీచర్లు తిరుమల, సరస్వతి, ఆశా వర్కర్ రాధ పాల్గొన్నారు.
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ నేపథ్యంలో మద్యం విక్రయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన విషయం తెలిసిందే. కానీ ఎక్సైజ్ అధికారులను మచ్చిక చేసుకుని తమ చీకటిదందా కొనసాగించాలని భావించిన కొందరు మద్యం వ్యాపారులు వారికి విందు భోజనాలు ఏర్పాటుచేశారు. అధికారులు కూడా తనిఖీల పేరుతో తమ పని కానిచ్చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం వెలుగుచూసిన ఈ ఘటన.. ఎక్సైజ్ అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. అచ్చంపేటలో మద్యం వ్యాపారులంతా ఎక్సైజ్ […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ లో స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో సుమారు 30 మంది ఆదివాసీ పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో మాస్క్ లు, నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పేదలకు ఇబ్బందులు కలగకూడదనే సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సారథి న్యూస్, ఖమ్మం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలను అరికట్టాలని కోరుతూ.. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌కు ఆ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ మండలాధ్యక్షుడు ఆపతి వెంకటరామారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుద్దుకూరు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా గిరిజన మోర్చా ప్రధాన […]