పారిస్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రీని రద్దుచేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జూన్ 28న జరగాల్సిన ఈ రేస్ ను కొనసాగించడం కష్టమని నిర్వాహకులు స్పష్టం చేశారు. 2020 ఫార్ములా వన్ సీజన్‌లో కరోనా దెబ్బకు వాయిదా లేదా రద్దయిన పదో ఈవెంట్ ఇది. ఆస్ట్రేలియా (మార్చి 15), మొనాకో (మే 24) రేస్‌లు కూడా రద్దు కాగా, బహ్రెయిన్ (మార్చి 22), వియత్నాం (ఏప్రిల్ 5), చైనా […]
సారథి న్యూస్, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర అటవీ ప్రాంతంలో కలెక్టర్ వి.వెంకటేశ్వర్లు, అటవీశాఖ సిబ్బందితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా గతేడాది మాస్ ప్లాంటేషన్ లో ఎంపీ సంతోష్ కుమార్ నాటిన మొక్కలు బాగున్నాయని అభిప్రాయపడ్డారు. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలంలో మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. ఎకో పార్క్ పార్కులో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్నారు. కీసరలోని చెరువును సుందరీకరించి పర్యాటక […]
సారథి న్యూస్, నారాయణపేట: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వాటి యజమానులు ఆదుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం, గొల్లపల్లిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలతో పాటు వలసొచ్చిన కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, నగదును ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మానవతా […]
సారథి న్యూస్, శ్రీకాకుళం : దేశ, విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యపరీక్షలు చేయించుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్, కరోనాపై తీసుకుంటున్న చర్యలపై మీడియాకు వివరించారు. జిల్లాకు ఇప్పటివరకు విదేశాల నుండి 13,500 మంది వరకు వచ్చారని, వారు స్వచ్ఛందంగా సెల్ నం.94912 22122, 089422 40699 లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలన్నారు. ఢిల్లీ, ముంబై తదితర […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రామడుగు, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్, గుండి, గోపాలరావు పేట్, తిర్మలాపూర్, శ్రీరాములపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ ను యుద్ధప్రతిపాదికన కోహెడకు తరలించారు. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ […]
సారథి న్యూస్, మెదక్: సాధారణంగా ఎక్కడైన దొంగలు దొంగతనం చేస్తారు. కానీ విచిత్రంగాఓనర్ లే వైన్స్ కు కన్నం వేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు కథనం ప్రకారం.. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్ డౌన్ సందర్భంగా గౌరారం లోని వైన్స్ కు ఎక్సైజ్ అధికారులు సీల్ వేశారు. కొన్ని రోజులుగా దొంగతనాలు […]
సారథి న్యూస్, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న పకడ్బందీ చర్యల ఫలితంగా రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం రాజకీయ కార్యదర్శి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా హవేళి ఘనపూర్ మండలం కూచన్‌పల్లిలో సొంతంగా తయారుచేయించిన మాస్క్ లు, శానిటైజర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్ ను పూర్తిగా నివారించే వరకు ప్రభుత్వం ప్రకటించిన లాక్ […]