సారథి న్యూస్, వనపర్తి: కరోనా పట్ల వనపర్తి జిల్లా ప్రజలు మరింత అప్రమతంగా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. వచ్చేవారం నుంచి జిల్లాలోని నాలుగు కోర్టులు ప్రారంభమవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా న్యాయమూర్తులు, లాయర్లకు మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు, శానిటైజర్లను 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులుకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. వానాకాలంలో మరింత అప్రమత్తంగా […]