సారథి న్యూస్, వాజేడు: ఒక్కసారిగా ఊరంతా దుర్వాసన లేచింది. కరోనా నేపథ్యంలో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఊరులో ఏం జరిగిందని ఆరాతీయడం మొదలుపెట్టారు. తీరా విషయం ఏమిటంటే.. ములుగు జిల్లా వాజేడు మండలం పూసూరు పంచాయతీ ఆఫీసు పక్కన ఉన్న చింతచెట్టు కొమ్మలను పదిరోజుల క్రితం పంచాయతీ సిబ్బంది నరికివేశారు. కొమ్మలపై కొంగ గుడ్లు, పిల్లలు పదులసంఖ్యలో ఉన్నాయి. చెట్లు నరికిన సమయంలో అవి కింద 50 పిల్లల మేర చనిపోయాయి. అంతేకాదు గుడ్లన్నీ పగిలిపోయాయి. వాటిని […]
సారథి న్యూస్, వాజేడు: 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ములుగు జిల్లా వాజేడు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెనుమల్లు రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వాజేడు నాగారం పంచాయతీలో సర్పంచ్ తల్లడి ఆదినారాయణ, సెక్రటరీ అశోక్, పెనుగోలు కాలనీలో అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి, మల్లక్క, పెద్దగొళ్లగూడెంలో సర్పంచ్ మేనక, సెక్రటరీ శిరీష, మెురుమూరులో పూసం నరేశ్, సెక్రటరీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా స్వేరో సర్కిల్ ప్రధాన కార్యదర్శిగా వాజేడు మండలానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు గురువారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గ్రామాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతను ఉన్నతస్థాయికి చేర్చుతామన్నారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా మెురుమూరు గ్రామపంచాయతీలో శుక్రవారం వాజేడు వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించింది. అనంతరం ‘ప్రైడే డ్రైడే’ నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశ్వరరావు, కోటిరెడ్డి, శ్రీనివాస్, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు, సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, వాజేడు(ములుగు): అందరికీ కరోనా టెస్టులు చేయాలని టీఏజీఎస్ అధ్యక్షుడు దబ్బకట్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేయాలని డిమాండ్‌చేశారు. ప్రతి పేద కుటుంబానికి రూ.7,500 ఇవ్వాలని కోరారు. ప్రతి రేషన్‌కార్డుదారుడికి 10 కేజీల బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనిదినాలు రెండొందల రోజులకు పెంచాలన్నారు. రోజుకు రూ.600 వేతనం ఇస్తూ.. ఫీల్డ్ అసిస్టెంట్లతో పనులు చేయించాలన్నారు. మధ్యాహ్న భోజనం ఇంటివద్దకే పంపించాలని, […]
సారథి న్యూస్, వాజేడు(ములుగు): ములుగు జిల్లా వాజేడు మండలంలోని మెురుమూరు పంచాయతీ గణపురం గ్రామంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారు, గర్భిణులు, బాలింతలు, క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. బీపీ, షుగర్వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యచికిత్సలు చేశారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ డి.వెంకటేశ్వరరావు, […]
సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామంలో గురువారం హెల్త్ క్యాంప్ నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అందరూ కచ్చితంగా మాస్కులు కట్టుకోవాలని, సామాజిక దూరం పాటించాలని డాక్టర్లు సూచించారు. బీపీ, షుగరు, టీబీ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశావర్కర్లు, 104 వాహన సిబ్బంది పాల్గొన్నారు.