లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్‌కు చెందిన రౌడీ షీటర్ వికాస్ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]