సారథిన్యూస్, రామడుగు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతులు కల్లాలు నిర్మించుకొనేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబోసుకోటానికి ఈ కల్లాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కల్లాలకు చిన్న సన్నకారు రైతులు అర్హులని పేర్కొన్నారు. 50 చ.మీ కల్లాలకు రూ. 56 వేలు, 60 చ. మీ రూ. 68 వేలు, 75 చ.మీ రూ. 85వేలు నిర్ధారించారని చెప్పారు. […]