బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, పెద్దపల్లి: దేశన్యాయవ్యవస్థలో కేంద్రప్రభుత్వ జోక్యం మితిమీరిపోతున్నదని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను ప్రమాదంలో పడేసి రాజకీయాలు చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. న్యాయవ్యవస్థ దేశంలో స్వతంత్రత గల రాజ్యాంగబద్ధ సంస్థ అని, కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థను సవాల్ చేస్తూ, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. దేశంలో ఈడీ, సీబీఐ, మీడియా సంస్థలవలే న్యాయవ్యవస్థను కూడా తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తుందని […]