సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ఎస్సై మాలకొండ రాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హన్మజిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్వాడాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని మాట, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
సారథి, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు బుధవారం రిటైర్డ్ అయ్యారు. ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రమౌళి, అర్చక, ఉపప్రధాన అర్చక గొప్పన్నగారి నాగన్న, ఈఏవో సంకేపల్లి హరికిషన్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి పేరుక శ్రీనివాస్ తో పాటు ఏఈవో బి.శ్రీనివాస్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, నాగుల మహేష్, వరి నరసయ్య, స్థానాచారి […]
సారథి, చొప్పదండి: పట్టణ ప్రగతిలో భాగంగా చొప్పదండి పట్టణంలోని ఆరో వార్డు వడ్లూరి గంగరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రధానంగా నీటి సమస్య, కరెంటు, డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. వీటి మీద వెంటనే చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లురి గంగరాజు మాట్లాడుతూ.. సీఎం కేఆర్ఆర్ ఆదేశాలనుసారం పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పెంచాలని, […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]
సారథి, వేములవాడ: వంద పడకల ఆస్పత్రి సముదాయం చుట్టూ పరిసరాలను చదును చేసి శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశించారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రి సముదాయాన్ని పరిశీలించారు. ఐసీయూ, సాధారణ వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన పరికరాలు త్వరలోనే తీసుకొస్తామన్నారు. విద్యుత్ సదుపాయంతో సహా ఇతర మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ మహేశ్ రావు, తదితరులు ఉన్నారు.
సారథి, వేములవాడ: కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ సౌకర్యం లేనివారు తాము ఉండడానికి వీలుగా వేములవాడ పట్టణంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చని ఇన్ చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్శ్రీరాములు తెలిపారు. సరైన సదుపాయం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, హోం క్వారంటైన్ సదుపాయం లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్ సెకండ్ వేడ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, […]
సారథి, వేములవాడ: కరోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిపై అవగాహన లేక, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే కొవిడ్ వ్యాక్సిన్తీసుకునే ప్రాణాపాయం నుంచి కొంత బయటపడొచ్చని డాక్టర్లు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ కింద సూచించిన సైట్అడ్రస్లో పేరు, వయస్సు, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదుచేసి సూచించిన తేదీలో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు […]