సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల పంచాయతీకి సోమవారం బీజేపీ నాయకులు భారతమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకే ఈ చిత్రపటాలను బహూకరిస్తున్నట్లు తెలిపారు. వెలిచాల సర్పంచ్ వీర్ల సరోజ, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్ రావు, బీజేపీ నాయకులు కట్ట రవీందర్, ముడుగంటి శ్రీనివాసాచారి పాల్గొన్నారు.