సారథి న్యూస్, మహబూబ్ నగర్: నూతనంగా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు నిజాయితీగా పనిచేసి పేదలకు అండగా నిలవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉద్యోగాన్ని కూడా తమ సొంత పనిలా భావించి కష్టపడి పనిచేస్తే రాణిస్తారని హితబోధ చేశారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్హాల్లో నూతన డిప్యూటీ తహసీల్దార్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ శాఖకు గతం నుంచి మంచిపేరు ఉందన్నారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్లాగ్ ద్వారా భర్తీచేసిన […]