చండీగఢ్: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారిసంఖ్య 86కు చేరింది. ఇప్పటికే తరన్ తరన్ జిల్లాలో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది చనిపోయారు. తాజాగా శనివారం తరన్ తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్చేశారు. ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. […]