Breaking News

గద్వాల

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]

Read More
రాత్రి వేళ దుండగుల హల్ చల్

రాత్రివేళ దుండగుల హల్ చల్

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో హల్ చల్ సృష్టిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు. బయట రోడ్లపై కనిపించిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు, బంగారు నగలు, విలువైన వస్తువులను లాక్కెళ్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు పుల్లూరు గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే […]

Read More

కరోనాను ఎదుర్కొనే శక్తి.. గొప్ప వరం

సారథి న్యూస్, మానవపాడు: ఏడాది పాటు ఒకరికి మరొకరు కలవకుండా, తల్లికి పిల్లభారమనేలా కరోనా చేసిందని, మహమ్మారిని తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత అన్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ ​ప్రక్రియను డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ సవిత సమక్షంలో ఆమె ప్రారంభించారు. వాక్సిన్ ను మొదట హెల్త్ వర్కర్, రెండో వ్యాక్సిన్ డాక్టర్ కు ఇచ్చారు. కరోనా […]

Read More
మా పొలాల గుండా గ్యాస్​పైప్​లైన్ వద్దు

మా పొలాల గుండా గ్యాస్​పైప్​ లైన్ వద్దు

సారథి న్యూస్, మానవపాడు: తమ వ్యవసాయ పంట పొలాల గుండా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు గ్యాస్ పైప్ లైన్ వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామస్తులు రాయచూర్– కర్నూలు అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. తక్షణమే గ్యాస్ పైప్​ లైన్​ పనులను ఆపివేయాలని డిమాండ్​ చేశారు. పైప్​లైన్​ద్వారా ప్రాణనష్టం వాటిల్లుతుందన్నారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్​ స్తంభించిపోయింది. పోలీసు అధికారులు వచ్చి నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.

Read More
వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

వాడీవేడిగా మానవపాడు జనరల్​బాడీ మీటింగ్​

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమస్యలపై నిలదీస్తూ పలువురు సర్పంచ్​లు సమావేశాన్ని అడ్డుకున్నారు. పంచాయతీలో చేస్తున్న ప్రతి పనికి కమీషన్లు అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల తీరుకు నిరసనగా జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, సర్పంచ్​లతో కలిసి నేలపై కూర్చుని నిరసన తెలిపారు. బుధవారం ఎంపీడీవో ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట్ల అశోక్​రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జడ్పీ చైర్​పర్సన్ సరిత […]

Read More
పుష్కరస్నానం.. పుణ్యఫలం

పుష్కరస్నానం.. పుణ్యఫలం

సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పుల్లూరు పుష్కర ఘాట్ భక్తుల తాకిడితో పులకరించింది. పుష్కరాలు ఆదివారానికి పదిరోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఓ వైపు తుఫాన్.. మరోవైపు కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు అన్ని జాగ్రత్తులు తీసుకుంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. పుల్లూరులో ఉన్న శివాలయం, కాలభైరవుడు సూర్యనారాయణ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దర్శనం చేసుకున్నారు.పుల్లూరు సర్పంచ్ నారాయణమ్మ తన కుటుంబసభ్యులతో ఆదివారం పుష్కర […]

Read More
పులకించిన పుల్లూరు

పులకించిన పుల్లూరు

లక్ష తులసి దళాలతో అర్చన జ్యోతివాస్తు విద్యాపీఠం పుష్కర పూజలు సారథి న్యూస్, మానవపాడు: తుంగభద్ర నది పుష్కర మహోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పుల్లూరు గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో పీఠాధిపతి జ్యోతి వాస్తు విద్యాపీఠం సిద్ధాంత భాస్కర మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో బాసర సరస్వతి అమ్మవారికి లక్ష తులసి దళాల అర్చన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మొదట పుష్కర ఘాట్ లో సరస్వతి దేవి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. మహిళలు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చెన్నకేశవ స్వామి […]

Read More
పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

పుష్కరాల భక్తులకు బస్సు ఏర్పాటు

సారథి న్యూస్​, అలంపూర్​(మానవపాడు): తుంగభద్ర నది పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ స్థలం నుంచి జోగుళాంబ ఆలయం వరకు ఉచిత బస్సు సర్వీసును అలంపూర్ మున్సిపాలిటీ వారు, జోగుళాంబ ఆలయం ట్రస్ట్ బోర్డు వారు కలిసి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటుచేశారు. సెట్వీన్ బస్సు సర్వీసులను మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్, టెంపుల్ బోర్డ్ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ యాదగిరి, మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శేఖర్ […]

Read More