సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామాన్ని బుధవారం ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారికి వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, హరితహారం పనులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆరాతీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. అభివృద్ధి పనులకు ఇసుక కొరత ఉందని సర్పంచ్ బొల్లె సుశీల ఈశ్వర్ వారి దృష్టికి తీసుకెళ్లారు. […]
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కన్నుమూత వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నేత సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు బరిలోకి దిగి రెండుసార్లు ఎన్నికయ్యారు. ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో రైతు కుటుంబంలో 1947లో జన్మించారు. వ్యవసాయం వృత్తి కలిగిన ఆయన రాజకీయాల్లో […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ గురువారం సందర్శించి ఆస్పత్రి భవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని తెలియడంతో స్థానిక తహసీల్దార్ సైదులుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకవేళ ఆస్పత్రిని మార్చితే స్థానిక అనుకూలమైన భవనాలను కలియ తిరిగి చూశారు.
సారథి న్యూస్, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న వరిధాన్యం పారా బాయిల్డ్ మిల్లులుకే పరిమితం కాకుండా అన్ని మిల్లులకు అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ తదితరులు ఉన్నారు.