వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, మెదక్: పోతంశెట్టిపల్లి– ఏడుపాయల రోడ్డు నిర్మాణం, ఇతర పనుల కోసం సీఎం కేసీఆర్ రూ.31.31కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి గతంలో రూ.19 కోట్లు మంజూరుకాగా, వాటితో వంతెనలు నిర్మించారని చెప్పారు. మహాశివరాత్రి జాతరలోగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. మంజూరైన నిధుల ద్వారా సీసీరోడ్లు, వంతెనలు, వంతెనపై ఫుట్‌పాత్ తదితర పనులు చేపడతారని […]
సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ప్రజలు, అధికారులు, నాయకుల సహకారంతో కృషిచేస్తానని కలెక్టర్ఎం.హనుమంతరావు ప్రకటించారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవాని మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏడుపాయలలో ఆలయ ఈవో శ్రీనివాస్కలెక్టర్కు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వనదుర్గామాత అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని.. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు దుర్గామాతను […]
సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ […]
సారథి న్యూస్, మెదక్: వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయంలో పూజారులు వనదుర్గామాత విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. పుష్పాలంకరణ చేశారు. ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.