సారథి, చొప్పదండి: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు నియోజకవర్గ దళితులపై చిత్తశుద్ధి, గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, దళితబంధు పథకాన్ని ఇక్కడ కూడా అమలుచేసేలా రాష్ట్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ఎస్సీసెల్ చొప్పదండి పట్టణాధ్యక్షుడు కనుమల్ల రాజశేఖర్ అన్నారు. బుధవారం ఆయన చొప్పదండిలో విలేకరులతో మాట్లాడారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద కేవలం హుజూరాబాద్ లో మాత్రమే అమలు చేస్తామని చెప్పడం, రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లోని దళితులందరినీ ప్రభుత్వం నిరాశకు గురిచేసిందన్నారు. […]
సారథి, చొప్పదండి: చొప్పదండి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కొలిమికుంట గ్రామానికి చెందిన చొక్కల్ల లక్ష్మణ్ ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా చీకట్ల శంకర్, ప్రధాన కార్యదర్శి ఎండీ జహంగీర్, క్యాషియర్ గా లంక రవిని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గాన్ని సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన క్యాంపు ఆఫీసులో సన్మానించారు. ఆటోడ్రైవర్లు, ఓనర్ల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ అరెళ్లి చంద్రశేఖర్ గౌడ్, యూనియన్ అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా పాలురి ప్రసాద్, […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిచ్చా చాయ్ టీ స్టాల్ ను బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, నాయకులు తాల్లపల్లి శ్రీనివాస్, పబ్బ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: మండల పరిషత్ సమావేశాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేవనెత్తిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం చొప్పదండి మండల జనరల్ బాడీ మీటింగ్ ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన జరిగింది. అర్హులైన అందరికీ రేషన్ కార్డు లు ఇవ్వాలని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సింగిరెడ్డి క్రిష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఇంకుడు గుంతల బిల్లులు చెల్లించాలని పలువురు సభ్యులు […]
సారథి, రామడుగు: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,200 విలువైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పెళ్లి పేదలు అప్పుచేసి చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా ప్రతిఒక్కరికీ రూ.లక్ష నూట పదహార్లు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో నాయకులంతా గుమికూడి చెక్కులు […]
సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీని శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎంఎల్ఏ సుంకే రవిశంకర్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్ కోమల్ రెడ్డి, […]
సారథి న్యూస్, చొప్పదండి: పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయక నిధి కింద రూ.3,20,500 మొత్తాన్ని చెక్కుల రూపంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని వారికి ఇది వరం లాంటిదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీ చిలుక రవిందర్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సంబన్న ,టీఆర్ ఎస్ […]