న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ 19 కంటైన్‌మెంట్ జోన్లలో యోగా సెంటర్లు, జిమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. అలాగే 65 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, 10ఏళ్ల లోపు పిల్లలు వెంటిలేషన్ లేని జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం కచ్చితంగా […]
ముంబై: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యోగాసానాలు వేశాడు. కూతురు సారా, కుమారుడు అర్జున్ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యారు. ‘పిల్లలతో కలిసి యోగా చేయడం వల్ల ఫాదర్స్ డేను కూడా జరుపుకుంటున్నాం’ అని సచిన్ ట్వీట్ చేశాడు. అంతకుముందు తన నాన్నతో ఉన్న ఫొటోను కూడా మాస్టర్ అభిమానులతో పంచుకున్నాడు. ‘అన్నింటికంటే ముందు మంచి వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నించు. అని మీరు చెప్పిన విలువైన మాటలను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని […]
సారథి న్యూస్, రామడుగు: యోగా ద్వారా వ్యక్తి మానసిక వికాస పరిపూర్ణ వికాసం సాధ్యమవుతుందని, శారీరక దృఢత్వం పెంపొందుతుందని విద్యావంతుల వేదిక కరీంనగర్ జిల్లా రామడుగు సభ్యులు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం యోగా డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యోగ శరీరానికి మంచి ఔషధం లాంటిదన్నారు.
న్యూఢిల్లీ: ప్రతి రోజు యోగా చేసేవారికి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ అని ఆయుష్ మినిస్టర్ శ్రీపాద నాయక్ అన్నారు. ఆదివారం యోగాడే పురస్కరించుకుని పీటీఐ వార్త సంస్థతో మాట్లాడిన మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘మోడీ నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా యోగాకు ప్రాచుర్యం లభించిందని, అది కరోనాతో పోరాడేందుకు బాగా ఉపయోగపడిందని నేను కచ్చితంగా చెప్పగలను. యోగా చేసే వాళ్లు కరోనా బారిన పడటటం చాలా తక్కువ’ అని మంత్రి చెప్పారు. యోగా ఇమ్యూనిటీని పెంచుతుందని, […]
సారథి న్యూస్, హుస్నాబాద్/ రామడుగు/గోదావరిఖని: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలోని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. యోగాతో అనేక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా యోగా దినోత్సవం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మున్సిపల్ వైస్ చైర్పర్సన్, యోగా టీచర్ అనితారెడ్డి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యోగాసనాలు వేస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవని […]
న్యూఢిల్లీ : యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా మహమ్మారి కరోనాను ఎదుర్కోవచ్చని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగాతో శ్వాస ఇబ్బందులు తొలిగిపోతాయని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆన్లైన్లో జాతినుద్దేశించి ప్రసంగించారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. భారతదేశానికి మనపూర్వీకులు అందించిన గొప్పవరం యోగా అని పేర్కొన్నారు. నేడు ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నదని చెప్పారు. ఇంట్లోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి యోగాను చేయాలని సూచించారు.
న్యూఢిల్లీ: ఏటా జూన్ 21న ఘనంగా జరిగే ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా సెలబ్రేషన్స్ కోసం లెహ్ వెళ్తారా? లేదా? అనే దానిపై కూడా ఇంకా డిసైడ్ అవలేదని ఆయుష్ సెక్రటరీ వైద్య రాజేశ్ చెప్పారు. ఈ ఏడాది లడఖ్‌లోని లెహ్‌లో జరిగే ఇంటర్నేషనల్ యోగా సెలబ్రేషన్స్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారని ఆయుష్ మంత్రిత్వ శాఖ మార్చిలో ప్రకటించింది. […]