సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం సికింద్రాబాద్ లోని మహిళా కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు హాజరయ్యారు. చైర్‌పర్సన్‌తో పాటు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మహిళా హక్కుల రక్షణ కోసం కమిషన్ ఆవిశ్రాంతంగా పనిచేయాలని సూచించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మెదక్ జిల్లాకు చెందిన మాజీమంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నియమించారు. అలాగే సభ్యులుగా షాహినా అఫ్రోజ్, కుమ్మర ఈశ్వర్ భాయ్, కొమ్ము ఉమాదేవి యాదవ్, గద్దల పద్మ, సుద్దం లక్ష్మి, కఠారి రేవతిరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. వీరంతా ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.