Breaking News

WANAPARTHY

నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు

సారథి న్యూస్​, వనపర్తి: రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులు అంటగడితే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్​ ఎస్సై వెంకటేశ్​ గౌడ్ హెచ్చరించారు. శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు పలువురు సీడ్స్​, ఫర్టిలైజర్​ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న సీడ్స్​, ఎరువులను మాత్రమే అమ్మాలని సూచించారు. వ్యాపారులు ఎవరైనా మోసం చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైతులను కోరారు.

Read More

పారిశుద్ధ్యం బాధ్యత అధికారులదే

సారథి న్యూస్​, వనపర్తి: ఈనెల 8 తర్వాత కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులతో సమీక్షించారు. గ్రామాల పారిశుద్ధ్యం ఎంపీడీవోలు, ఎంపీవోలదే బాధ్యత అని అన్నారు. హరితహారం మొక్కల పెంపకంపై ప్లాన్​ను సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు ఆమె ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించారు. జడ్పీ హైస్కూలు ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. అమరచింత ఆత్మకూరు […]

Read More

పునరుత్తేజం కల్పిద్దాం

సారథి న్యూస్​, వనపర్తి: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద రైతులు, వలస కూలీలతో పాటు పారిశ్రామిక రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు బ్యాంకర్లు నిర్దేశించిన గడువు కంటే ముందుగానే లోన్లు ఇవ్వాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్​లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో సమీక్షించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఔత్సాహిక ప్రోత్సాహం కింద చేయూత ఇవ్వాలని సూచించారు. బ్యాంకుల వారీగా ఉన్న […]

Read More

వారి సేవలు వెలకట్టలేనివి

సారథి న్యూస్​, వనపర్తి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.

Read More

ధీరవనిత ఝల్కారీబాయి

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వీరనారి ఝల్కారీబాయి 162 వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం కావాలని పోరాటం కొనసాగించిన ధీరవనిత ఝల్కారీబాయి అని కొనియాడారు. సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి ఝాన్సీ ప్రాంతాన్ని రక్షిందన్నారు. ఆమె స్ఫూర్తితో మనమంతా దేశసమైక్యతకు పునరంకింత కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, కవి పండితుడు గిరిరాజాచారి, యూటీఎఫ్​ జిల్లా […]

Read More

సురవరం.. తెలంగాణకు వరం

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో టీజేఏసీ ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి 134వ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకుడి, పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. తెలంగాణకు ఆయన వరం లాంటి వారని అన్నారు. నిజాం పాలనపై గర్జించిన యోధుడని కొనియాడారు. కార్యక్రమంలో కవిపండితుడు గిరిరాజాచారి, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు […]

Read More

భాగ్యరెడ్డివర్మ.. దళిత హక్కుల సూరీడు

ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ సారథి న్యూస్​, వనపర్తి: భాగ్యరెడ్డి వర్మ.. తెలంగాణ వైతాళికుడని, దళిత చైతన్య ప్రతీక అని, బాల్యవివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించిన మహనీయుడని ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ కొనియాడారు. 132వ జయంతిని శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు నివాసంలో నిర్వహించారు. ముఖ్య​అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపారని కొనియాడారు. హక్కుల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. అనే స్కూళ్లను ప్రారంభించి […]

Read More