ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే లక్ష్యం రెవెన్యూశాఖలో ప్రమోషన్లు ప్రక్రియను పూర్తిచేయాలి ట్రెసా ప్రతినిధుల సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజల కేంద్ర బిందువుగానే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేద్దామని పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ […]
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వీఏవోలు, వీఆర్వోలకు తీపికబురు అందించారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చట్టం బిల్లును తీసుకొస్తున్నామని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఏవోలను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో వీఆర్వోలను భర్తీ చేస్తామన్నారు. రెవెన్యూ సంస్కరణ వల్ల ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఉండదని సీఎం స్పష్టంచేశారు. సంస్కరణల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రెవెన్యూ సమస్యల […]
సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]
సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్లైన్లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, […]
సారథిన్యూస్, పాల్వంచ: ఓ మహిళా అధికారి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా ఏసీబీకి చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి చెందిన ఓ బాధితురాలు .. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నది. ఆ దరఖాస్తును అప్రూవల్ చేసేందుకు వీఆర్వో పద్మ లంచం డిమాండ్ చేసింది. బాధితురాలు ఏసీబీని ఆశ్రయించగా .. రంగంలోకి దిగిన అధికారులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో పద్మ.. లంచం తీసుకుంటుండగా అధికారులు గా పట్టుకున్నారు.
సారథిన్యూస్, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ, అతడి కుటుంబసభ్యులు నలుగురికి కరోనా సోకింది. కాగా కొంతకాలంగా వీఆర్ఏకు కరోనా లక్షణాలు కనిపించడంతో అతడి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా పరీక్షలు చేయించుకోగా.. వీఆర్వోకు అతడి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.