సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఓ అగంతకుడు తెంచుకొని పారిపోయిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దేవభక్తిని లక్ష్మి అనే మహిళ అయ్యప్ప స్వామి ఆలయం వద్ద శబరి కళ్యాణ మండపంలో జరుగుతున్న వివాహానికి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై బస్సు దిగి నడుచుకుంటూ మరో ఇద్దరు మహిళలతో కలిసి వెళుతుంది. ఈ సమయంలో […]
సామాజిక సారథి, వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని పాలడుగు, రెబ్బవరం, గొల్లపూడి గ్రామాల్లో వైరస్ సోకిన మిర్చి తోటలను శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మిర్చి తోటలకు తామరపురుగు తెగులు ఆశిస్తున్నట్లు గుర్తించారు. దీని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారిణి అపర్ణ, మండల వ్యవసాయ శాఖ అధికారి పవన్ కుమార్, ఏఈవోలు వెంకట్ నర్సయ్య, వాసంతి కేవీకే శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వైరా: వైరాలోని సత్యసాయి వేద పాఠశాలలో మంగళవారం పుట్టపర్తి సత్యసాయిబాబా 92వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంబమూర్తి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గొల్లపూడి గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారుడు సిలివేరు వినయ్ కుమార్ కు టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు పసుపులేటి మోహన్ రావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున్ రావు, లైన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ మురళీకృష్ణ, చింతనిప్పు వెంకటయ్య, నంబూరి […]
సారథి న్యూస్, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన […]