సారథి, రామడుగు: ప్రగతి విద్యాసంస్థల అధినేత మండవ నాగేశ్వరరావు కరోనాతో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర్ రావు స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన 40 ఏళ్ల క్రితం రామడుగు మండలం గోపాల్ రావు పేటలో చైతన్య పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం మరో ఉపాధ్యాయుడు రాధాకృష్ణ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కర్ర శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి ప్రగతి విద్యాలయాన్ని […]
సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020–21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్విడుదలైందని ప్రిన్సిపల్ వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ బోధన ఉంటుంది. […]