Breaking News

VEMULAWADA

రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

రాజన్న సన్నిధిలో ఇంటలిజెన్సీ ఐజీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వరి స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ ప్రభాకరరావు సందర్శించారు. వారిని ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు వారిని ఆశీర్వదించారు. లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
హంగా పల్లెప్రగతి పనులు

ఉత్సాహంగా పల్లెప్రగతి పనులు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పల్లెప్రగతి పనుల్లో భాగంగా శనివారం శానిటేషన్, ఇంటింటికీ మొక్కల పంపిణీ చేపట్టారు. వర్షపు నీరు నిలిచే ఎగుడు దిగుడు ప్రాంతాల్లో మొరం పోయించారు. డ్రైనేజీలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, గ్రామస్తులు, మండల అధికారులు పాల్గొన్నారు.

Read More
కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు లాయక్​పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]

Read More
కరోనాపై పోలీసుల అవగాహన

కరోనాపై పోలీసుల అవగాహన

సారథి, వేములవాడ: కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్​ఎస్సై మాలకొండ రాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హన్మజిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్​వాడాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని మాట, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.

Read More
రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ

రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ

సారథి, వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించిన పలువురు ఉద్యోగులు బుధవారం రిటైర్డ్ ​అయ్యారు. ఆలయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చంద్రమౌళి, అర్చక, ఉపప్రధాన అర్చక గొప్పన్నగారి నాగన్న, ఈఏవో సంకేపల్లి హరికిషన్, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, కార్యదర్శి పేరుక శ్రీనివాస్ తో పాటు ఏఈవో బి.శ్రీనివాస్, పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, నాగుల మహేష్, వరి నరసయ్య, స్థానాచారి […]

Read More
రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

రాజన్న సన్నిధిలో మాధవానందస్వామి

సారథి, వేములవాడ: దక్షిణకాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తొగుట పీఠం శ్రీశ్రీశ్రీ మాధవానందస్వామి సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. స్వామి వారికి పూజల అనంతరం కల్యాణమండపంలో పాదపూజ చేశారు. వారి వెంట బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, అర్చకస్వాములు పాల్గొన్నారు. అలాగే ఒకేరోజు సుమారు 25వేల మంది భక్తులు దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆలయానికి రూ.20లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More
రాజన్న సన్నిధిలో ప్రముఖులు

రాజన్న సన్నిధిలో ప్రముఖులు

సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.

Read More
రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

రాజన్న సన్నిధిలో మాజీ ఎంపీ పొన్నం

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజారాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే మంగళవారం స్వామివారిని కరీంనగర్​ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆయనకు అర్చకులు ఘనస్వాగతం పలికారు. తదనంతరం వారికి స్వామివారి అభిషేకం లడ్డూ ప్రసాదం అందజేశారు. పొన్నం వెంట పలువురు కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More