సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరుప్రతిష్టలు పొంది కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఏకైక కైవక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం శాలువా కప్పి లడ్డూప్రసాదం అందజేసి సత్కరించారు.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఇటీవల జర్మనీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మొదటిసారి బుధవారం వేములవాడ రెండవ బైపాస్ రోడ్డులోని గెస్ట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను ప్రజలకు దూరంగా ఉంటారని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టారు. కొవిడ్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబసభ్యులతో జర్మనీలోనే ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు. […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్కర్ణన్ ను బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆయన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభిషేకం లడ్డూప్రసాదం అందజేసి ఆనందం వ్యక్తం చేశారు.
సారథి, వేములవాడ: త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లింలు బుధవారం వేములవాడ పట్టణంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నుంచి సమస్త భూప్రపంచాన్ని కాపాడాలని అల్లాహ్ను ప్రత్యేక ప్రార్థనలతో వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని జామే, మహ్మదీయ, ఆర్ఫా, మెయిన్, మదీనా మసీదుల్లో ప్రత్యేక నమాజు చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపల్లి ఇస్లాంనగర్, రుద్రవరం, శాత్రాజపల్లి, ఫజల్ నగర్ జామే మసీద్ లో మత గురువు బక్రీద్ పండుగ విశిష్టత, చారిత్రక […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో పిడియాట్రిక్ వైద్యసేవలు అందించేందుకు సరైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సూపరింటెండెంట్ ను ఆదేశించారు. మంగళవారం వేములవాడ మండలం తిప్పాపూర్ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలకు వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 50 పడకల్లో భాగంగా 20 పడకలు ఐసీయూ, మిగతా 30 పడకలు జనరల్ కు కేటాయించాలని ఆదేశించారు. ఆక్సిజన్ ట్యాంక్పనులను […]
సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న అరుణ్, గుండి నరసింహమూర్తి, వెళ్ది సంతోష్ పర్యవేక్షకులుగా పదోన్నతులు పొందారు. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వులను ఆలయ ఈవో డి.కృష్ణప్రసాద్ అందజేశారు. ఉద్యోగ సంఘం వినతి మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఖాళీపోస్టుల్లో అర్హత ఉన్న ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన ఈవో అధ్యక్షుడు చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
సారథి, వేములవాడ: స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు న్యాయవాదుల పాత్ర మరువలేనిదని గోదావరి అర్బన్ మల్టీ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ వేములవాడ శాఖ సీఈవో, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాచమనేని శ్రీనివాసరావు కొనియాడారు. శనివారం అంతర్జాతీయ న్యాయవాద దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, తిరుమల్ గౌడ్, భూమేష్, రేగుల దేవేందర్, గోపి, కిషోర్ రావు, అనిల్, గుడిసె సదానందం, నక్క దివాకర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. […]