Breaking News

VEMULAWADA

రాజన్న సన్నిధిలో అసిస్టెంట్ కలెక్టర్

రాజన్న సన్నిధిలో అసిస్టెంట్ కలెక్టర్

సామాజిక సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పార్వతి సమీత రాజరాజేశ్వరి స్వామివారిని శుక్రవారం సిద్దిపేట ట్రెయిని అసిస్టెంట్ కలెక్టర్ ఫ్రూఫ్ దేశాయి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్తంగా ఆశీర్వచనాలు అందించారు. ఏఈవో ప్రతాప నవీన్ కండువా కప్పి సన్మానించి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​మార్క్​

చిల్డ్రన్స్ పార్క్.. నేచురల్​ మార్క్​

సామాజిక సారథి, వేములవాడ: మారుతున్న ప్రపంచంలో కాలుష్యం పెరిగిపోయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఆస్పత్రుల పాలవుతున్న నేటి తరుణంలో పార్కులు, మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్​రోడ్డులో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, మున్సిపల్​చైర్​పర్సన్​రామతీర్థపు మాధవిరాజు చొరవతో చిల్డ్రన్​పార్కును ఆకట్టుకునేలా ఏర్పాటుచేశారు. పట్టణ ప్రజలు, చిన్నారులకు ఆహ్లాదం పంచేలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని సౌందర్యంతో రకకరాల మొక్కలను పెంచారు. పిల్లలను […]

Read More
రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

రాజన్నకు టీఎస్​పీఎస్సీ సభ్యుడి పూజలు

సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్​పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్​రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్​ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో […]

Read More
రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాజన్నసన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

సారథి, వేములవాడ: రాష్ట్రంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయ ఈవో, అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. మహామండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఈవో కృష్ణప్రసాద్ చిత్రపటం, ప్రసాదం అందజేసి సత్కరించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. వసతిగృహాల ప్రారంభంవేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా […]

Read More
రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలుచేయాలి

రాష్ట్రవ్యాప్తంగా ‘దళితబంధు’ అమలు చేయాలి

సారథి, వేములవాడ: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్​ చేస్తూ వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం, తెలంగాణ చౌక్ వద్ద షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హుజూరాబాద్ లో రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసి ప్రతి దళిత కుటుంబానికి ఈనెల 30వ తేదీలోపు రూ.1​0లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి […]

Read More
రాజన్న గోశాల నుంచి కోడెల వితరణ

రాజన్న గోశాల నుంచి కోడెల వితరణ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి తిప్పాపూర్ గోశాల నుంచి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కీలనపల్లి గ్రామ వినాయక గోశాల వెల్ఫేర్ సొసైటీకి 20 కోడెలను శనివారం వితరణగా ఇచ్చారు. కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఎల్.రాజేందర్, గోశాల ఇన్​చార్జ్​శంకర్ పాల్గొన్నారు.

Read More
వక్ఫ్ భూములను కాపాడండి

వక్ఫ్ భూములను కాపాడండి

సారథి, వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్ సర్వేనం.41,42,43 వక్ఫ్‌ బోర్డు భూముల్లో నిర్మిస్తున్న అక్రమకట్టడాలను కాపాడాలని పలువురు ముస్లింలు శనివారం సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ కు కలిసి వినతిపత్రం అందజేశారు. తిప్పాపూర్ లో చాలా వరకు వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతమై ఉన్నాయన్నారు. వాటికి రక్షణ కంచె వేసి కాపాడాలని కోరారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు వేములవాడ అర్బన్ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు.

Read More
రాజన్న హుండీ గలగల

రాజన్న హుండీ గలగల

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీని గురువారం లెక్కించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటలకు కౌంటింగ్​చేశారు. ఆలయానికి రూ.1.2 కోట్ల ఆదాయం సమకూరింది. 198 గ్రాముల బంగారం, 11 కిలోలన్నర వెండి వచ్చింది. ఈ లెక్కింపు ప్రక్రియ ఆలయ కార్యనిర్వహణాధికారి హరికిషన్ ఆధ్వర్యంలో కొనసాగింది.

Read More