వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవం పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, పాపన్నపేట: మహాశివరాత్రి పర్వదినం రోజున పవిత్ర మంజీరా నది పాయల మధ్య వనదుర్గామాత సన్నిధిలో ఏడుపాయల జాతర గురువారం వైభవంగా ప్రారంభమైంది. ఓ వైపు శివనామస్మరణ, మరోవైపు దుర్గమ్మ నామస్మరణతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. గురువారం తెల్లవారుజామున పూజారులు అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ, అర్చనలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే లు పద్మాదేవేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, మెదక్: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మంజీరా నదికి వరద ఉదృతి సంతరించుకుంది. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. దిగువన ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ప్రధాన ఆలయ ముందు ఉన్న నదీ పాయ పరవళ్ల తొక్కుతుండడంతో మండపంలోకి నీరు చేరింది. దీంతో ఆలయానికి రాకపోకలు ఆగిపోయాయి. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఉంచి భక్తులు […]