సారథి న్యూస్, పోలాకి(శ్రీకాకుళం): వంశధార ప్రాజెక్టు త్వరలోనే పూర్తిచేస్తామని, అన్నదాతలను అన్నిరకాలుగా ఆదుకుంటామని, శ్రీకాకుళం జిల్లా స్థితిగతులు, రూపురేఖలను సమూలంగా మార్చుతామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తి కావడంతో ప్రజల కోసం నాడు.. ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గురువారం 7వ రోజు సంఘీభావ యాత్రలో పాల్గొన్నారు. పోలాకి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు చేపట్టిన యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కాల్వల్లో నీరు చేరుతోందని, వాటితో అన్ని చెరువులను నింపాలని జలవనరుల శాఖ ఇంజనీర్లను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో తనను కలిసిన వంశధార, జల వనరులశాఖ ఇంజనీర్లతో కొద్దిసేపు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో శివారు కాల్వకు నీటిని అందించడంలో లోటుపాట్లు తలెత్తాయని, ఈసారి ఖరీఫ్ సీజన్‌కు ముందు నుంచే తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. రబీ పంటలకు అవకాశం ఉన్న […]