సారథి న్యూస్, మహబూబ్‌నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్తండ్రి నారాయణగౌడ్కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.