సారథి న్యూస్, హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ బి.వరప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 4,980 ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు వివరించారు. వాటిలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు3,380 ప్రత్యేక బస్సులను, ఏపీకి 1,600 బస్సులను నడిపిస్తున్నట్లు తెలిపారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, కార్మికులకు 50శాతం పెండింగులో ఉన్న రెండు నెలల జీతాన్ని తక్షణమే చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. తక్షణమే రూ.120కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తాను ఉన్నంత కాలం ఆర్టీసీని బతికించుకుంటానని స్పష్టంచేశారు హైదరాబాద్ నగరంలో బస్సు సర్వీసులను 50 శాతానికి పెంచాలని సీఎం నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్టీసీకి నష్టం.. కార్మికులకు ఉద్యోగ […]