త్రివేండ్రమ్: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]
తిరువనంతపురం: ఓ వైపు కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తుంటే.. కొందరేమో నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కేరళలోని ఓ రిసార్ట్లో జరిగిన విందులో సుమారు 300 మంది పాల్గొన్నట్టు సమాచారం. అనంతరం ఆ వీడియోలను సోషల్మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేరళలోని హిల్లీ జిల్లా ఉదుంబంచోలలో ఈ ఘటన చోటుచేసుకున్నది. రిసార్టు మేనేజర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ 29న ఈ […]