లండన్: కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగా ఓ బ్యాడ్‌న్యూస్.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఆస్ట్రాజెనెకా అనే వ్యాక్సిన్‌ను రూపొందించింది. క్లినికల్ ట్రయల్స్ కూడా శరవేగంగా ప్రారంభించింది. అయితే మొదటి ఒకటి, రెండు ట్రయల్స్‌లో సత్ఫలితాలే వచ్చాయి. కానీ మూడో ట్రయల్ మాత్రం దెబ్బేసింది. మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌కు చెందిన ఓ వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇవ్వగా అతడికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆక్సఫర్డ్.. […]
మాస్కో: రష్యా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్ – వీ’ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నదని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్పెట్ వెల్లడించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రష్యా వ్యాక్సిన్‌పై వెల్లువెత్తున్న ఆరోపణలకు చెక్‌పడింది. శుక్రవారం విడుదలైన లన్సెట్ జర్నల్‌లో రష్యా వ్యాక్సిన్‌పై విశ్లేషణాత్మక కథనాన్ని ప్రచురించారు. ఈ ఏడాది జూన్-జూలైలో రెండు దశల్లో మొత్తం 76 మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చారని జర్నల్‌లో పేర్కొన్నారు. వారిలో ఎవరికీ ఏవిధమైన ఆరోగ్య సమస్య రాలేదని పేర్కొన్నారు. పైగా వ్యాక్సిన్ […]
న్యూఢిల్లీ: మన దేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు వలంటీర్లు కావాలని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ప్రకటించింది. సోమవారం నుంచి క్లినికల్ ట్రయల్స్ షురూ చేసేందుకు పర్మిషన్ వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు నమోదు చేసుకోవాలని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఎయిస్ ఎథిక్స్ కమిటీ ఒప్పుకోవడంతో ఈ ప్రకటన రిలీజ్ చేశారు. మొదటి ఫేజ్‌లో 375 మందిపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించాల్సి ఉండగా, […]
జెనీవా: కరోనా పేషంట్ల ట్రీట్‌మెంట్‌కు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోర్వోకిన్ ట్యాబ్లెట్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రయల్స్‌ను నిలిపేసింది. ఆ డ్రగ్ కరోనాను పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు లోపినవిర్, రిటోనవిర్ డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్‌ను కూడా ఆపివేసినట్లు సంస్థల వెల్లడించింది. ఈ డ్రగ్స్ మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది.