Breaking News

TELANGANA

అగ్నికీలల్లో 9 మంది

అగ్నికీలల్లో 9 మంది

శ్రీశైలం పవర్ హౌస్​ ​మంటల్లో చిక్కుకుని మృత్యువాత తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశాలు సారథి న్యూస్, అచ్చంపేట: ఎటుచూసినా చిమ్మ చీకటి.. చుట్టూ దట్టమైన పొగలు.. ఎక్కడ చిక్కిన వారంతా అక్కడే ప్రాణాలు విడిచారు. తెలంగాణ పరిధిలోని పాతాళగంగ శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 9మంది దుర్మరణం పాలయ్యారు. ఒకరు డీఈ, నలుగురు ఏఈ స్థాయి అధికారులు ఉన్నారు. మిగతావారు సిబ్బంది ఉన్నారు. జెన్‌కో మొదటి యూనిట్‌లోని […]

Read More
తెలంగాణలో 1,967 కరోనా కేసులు

తెలంగాణలో 1,967 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,967 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 99,391 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 737కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 21,687 ఉన్నాయి. 24 గంటల్లో 26, 767 వైరస్​నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,48,078 శాంపిల్​టెస్టులు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా.. 473 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More
డిగ్రీ ఆన్ లైన్​ అడ్మిషన్స్.. దోస్త్ షెడ్యూల్

డిగ్రీ ఆన్ లైన్​ అడ్మిషన్స్.. దోస్త్ షెడ్యూల్

హైదరాబాద్​: ఎంసెట్‌, ఐసెట్ వంటి వాటికి ఆన్‌లైన్​లో అప్లై చేయడం, వెబ్ కౌన్సెలింగ్‌, వెబ్ఆప్షన్లు నమోదుచేయడం వంటివి మ‌న‌కు తెలుసు. కానీ రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంట‌ర్మీయట్‌, డిగ్రీ లెవెల్​లో అడ్మిష‌న్‌, ఎగ్జామ్స్ విష‌యంలో ఎలాంటి ఫ్రాడ్‌ జరిగేందుకు అవ‌కాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిష‌న్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ(దోస్త్‌)కు అనే ఆన్‌లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నారు.షెడ్యూల్ ఇలా..ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 […]

Read More
అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు

సారథి న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్​7 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులుతో కలిసి గురువారం పరిశీలించారు. అసెంబ్లీ, శాసనమండలిలో భౌతికదూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను […]

Read More

కరోనా నియంత్రణలో విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గంలో తెగిన చెరువులు, చెక్ డ్యాంలను సీపీఐ బృందం గురువారం సందర్శించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ, జిల్లా కార్యదర్శి మంద పవన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్, వనేష్, హన్మిరెడ్డి, సుదర్శన్, […]

Read More
తెలంగాణలో 1,724 కరోనా కేసులు

తెలంగాణలో 1,724 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,724 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 729 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరింది. ఇప్పటివరకు 75,186 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21,509 యాక్టివ్​కేసులు ఉన్నాయి. తాజాగా 1,195 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 395 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. భద్రాద్రి […]

Read More
‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

‘అపెక్స్ కౌన్సిల్’లో నిలదీద్దాం

తెలంగాణలో కొత్తగా ప్రాజెక్టులేవీ చేపట్టలేదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నవాటినే రీడిజైన్ చేశాం 25న సమావేశంలో అభ్యంతరాలను లేవనెత్తుదాం వ్యూహంపై సీఎం కె.చంద్రశేఖర్​రావు అధికారులకు దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు స్వాగతించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని స్పష్టంచేశారు. నదీజలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి ఉన్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో […]

Read More

జాగ్రత్తలతో కరోనాను జయిద్దాం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]

Read More