Breaking News

TELANGANA

ఆర్డీవోలకు స్థానచలనం

ఆర్డీవోలకు స్థానచలనం

హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.

Read More
జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

జెన్​కో ఉద్యోగుల మృతికి నివాళి

సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్​లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్​కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్​నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్​నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ […]

Read More

ప్రణాళికాబద్దంగా రైతువేదికలు

సారథి న్యూస్​, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్​శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్​లో సంబంధిత అధికారులతో కలెక్టర్​ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]

Read More
సినిమా షూటింగ్​లకు సింగిల్​విండో పాలసీ

సినిమా షూటింగ్​లకు సింగిల్​విండో పాలసీ

సారథి న్యూస్, హైదరాబాద్: పర్యాటక స్థలాల్లో సినిమా షూటింగ్ లు జరుపుకునేందుకు వీలుగా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సింగిల్​విండో పాలసీని తీసుకొస్తున్నట్టు మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ ప్రకటించారు. ఫారెస్ట్​ కార్పొరేషన్, టూరిజం శాఖల పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయన్నారు. సోమవారం పలువురు సినీ డైరెక్టర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొండలు, గుట్టలు, కోటలు, రిజర్వాయర్లు, బోటింగ్, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, అడవులు, ఎకో […]

Read More
జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

జాగ్రత్తగా ‘కోవిడ్ -19’ వేస్టేజీ నిర్వహణ

సారథి న్యూస్, హైద‌రాబాద్: పెరుగుతున్న జ‌నాభా, ప‌ట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కాలుష్య నివారణకు ప్రణాళికలను రూపొందించాలని మంత్రి ఎ.ఇంద్రకరణ్​రెడ్డి సూచించారు. సోమ‌వారం స‌న‌త్ న‌గ‌ర్ లోని పీసీబీ ఆఫీసులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ -19 బ‌యోమెడిక‌ల్ వేస్టేజీ నిర్వహణపై చర్చించారు. ఆస్పత్రుల్లో జీవవ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేస్తున్నారా? లేదా? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నిరంతరం తనిఖీలు నిర్వహించాల‌న్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న కంపెనీలకు నోటీసులు జారీచేసి, […]

Read More
తెలంగాణలో 1,842 కరోనా కేసులు

తెలంగాణలో 1,842 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం(24 గంటల్లో) 1,842 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,0,6091కు చేరింది. మహమ్మారి బారిన తాజాగా ఆరుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 761కు చేరింది. కాగా, 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,825 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 82,411కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,919 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో వ్యాధిబారిన పడి కోలుకున్నవారి […]

Read More
మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళా

మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళా

సారథి న్యూస్​, హైదరాబాద్​: మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ ఇతర రెవెన్యూ విభాగం సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం, బుధవారం సదస్సులు నిర్వహించి పరిష్కరించనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 15 వరకు కల్పిస్తున్నట్టు పేర్కొంది. రెవెన్యూ సదస్సులు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతాయని వెల్లడించింది.– డోర్ నంబర్ కోసం […]

Read More

కల్యాణ లక్ష్మి పేదలకు వరం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: సీఎం కేసీఆర్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పెద్దశంకరంపేట మండలం బుజరంపల్లి, గోపని వెంకటాపూర్​, టెంకటి గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ పేదప్రజల పక్షానే ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More