సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు.ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, పైడ్లా శ్రీను, రాగం లచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, మచ్చ గంగయ్య, కోట్ల మల్లేశం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు శనివారం రిలీజ్ చేశారు. జులై 1న పాలీసెట్, జులై 1 నుంచి 3వ తేదీ వరకు పీజీ సెట్, 4న తెలంగాణ ఈసెట్, 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10న లాసెట్, పీజీ సెట్, 13న ఐసెట్, 15న ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో […]